వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత , కోటా ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడిన కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఏప్రిల్ 30వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న కేజ్రీ సర్కార్ తాజాగా ఢిల్లీలో దారుణ పరిస్థితి నేపధ్యంలో కేంద్రంపై విరుచుకుపడింది .

కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్న కేజ్రీవాల్ .. దేశమంతా ఉచితంగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తికరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్న కేజ్రీవాల్ .. దేశమంతా ఉచితంగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి

కేంద్రం పై విరుచుకుపడిన కేజ్రీవాల్ .. ఢిల్లీ కోటా ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని ఆరోపణ

కేంద్రం పై విరుచుకుపడిన కేజ్రీవాల్ .. ఢిల్లీ కోటా ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని ఆరోపణ


దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది . కరోనా కట్టడికి ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీకి ఇవ్వాల్సిన ఆక్సిజన్ కోటాను కేంద్రం తగ్గించి ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

ఢిల్లీకి ఉద్దేశించిన 140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు మళ్లించారని, దానిని పునరుద్ధరించాలని ఆయన కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాశారు.

కేంద్రానికి లేఖతో పాటు కేంద్రం తీరుపై కేజ్రీవాల్ ట్వీట్

కేంద్రానికి లేఖతో పాటు కేంద్రం తీరుపై కేజ్రీవాల్ ట్వీట్

జాతీయ రాజధాని, ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటోందని, ఈ సమస్య "అత్యవసర పరిస్థితి" గా మారిందని ఆయన అన్నారు.
గణనీయంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఢిల్లీకి సాధారణ సరఫరా కంటే చాలా ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉందని అయితే కేంద్రం సరఫరాను పెంచే బదులు, సాధారణ సరఫరా కూడా బాగా తగ్గించిందని ఢిల్లీ కోటా ఇతర రాష్ట్రాలకు మళ్లించబడిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు . ఆక్సిజన్ ఢిల్లీలో ఒక ఎమర్జెన్సీ గా, మారిందని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

 దేల్హికి ఆక్సిజన్ అత్యవసరంగా మారిందని పీయూష్ గోయల్ కు లేఖ

దేల్హికి ఆక్సిజన్ అత్యవసరంగా మారిందని పీయూష్ గోయల్ కు లేఖ


ఢిల్లీలో బెడ్స్ , ఆక్సిజన్ సరఫరా , ఐసియు బెడ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. డిప్యూటీ మనీష్ సిసోడియా ఆక్సిజన్ అత్యవసర పరిస్థితి పై ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని సహాయం కోరిందని ట్వీట్ చేశారు . పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో, కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులకు ప్రధాన సరఫరాదారులలో ఒకరైన ఐనాక్స్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు మళ్లించబడింది. ఈ క్లిష్టమైన దశలో, ఇప్పుడు ఢిల్లీకి కేటాయించిన కొత్త సరఫరాదారులతో ఆసుపత్రులు ఒప్పంద ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని కేంద్రానికి విజ్ఞప్తి

నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని కేంద్రానికి విజ్ఞప్తి

ప్రధాన ఆసుపత్రులలో ఇప్పటికే చాలా క్లిష్టమైన కొరత కనిపిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి, 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను నిరంతరాయంగా సరఫరా చేయమని మరియు 140 టన్నుల ఆక్సిజన్‌ను ఐనాక్స్ ద్వారా ఢిల్లీకి పునరుద్ధరించడానికి సంబంధిత సూచనలు ఇవ్వమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.
కేంద్రం కరోనా కష్ట కాలంలో కావాల్సిన సహాయ సహకారాలను అందించటం లేదని ఇప్పటికే మహారాష్ట్ర సీఎం కూడా ఆరోపించారు. ఇప్పుడు కేజ్రీవాల్ సైతం కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal alleged that the Centre has reduced Delhi's quota of medical oxygen and diverted it to other states. He also wrote to Union minister Piyush Goyal, alleging that 140 Metric Tonnes of Oxygen meant for Delhi was diverted to other states and should be restored. The national capital, he said, is facing an acute shortage of oxygen, and declared the issue has become "an emergency".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X