భద్రత లేకుండా: భార్యతో కలిసి కేజ్రీవాల్ సామాన్యుడిలా మార్నింగ్ వాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవిందే కేజ్రీవాల్.. ఆదివారం నాడు ఎలాంటి భద్రత లేకుండా ఉదయం నడకకు వెళ్లారు. తన భార్యతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఆయన కౌషంబిలోని తన నివాసానికి సమీపంలో వాకింగ్ చేస్తూ ప్రజలకు కనిపించారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నాం 12.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు.

కేజ్రీవాల్ అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్‌కుమార్, ఆసిం అహ్మద్ ఖాన్‌లతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్, వెంటనే తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. సందీప్ కుమార్ (శిశు సంక్షేమం), సత్యేంద్ర జైన్ (వైద్య ఆరోగ్యం), గోపాల్ రాయ్ (రవాణా, కార్మిక శాఖ), జితేంద్ర తోమర్ (న్యాయ శాఖ) కేటాయించినట్లు తెలుస్తోంది.
రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం 10.30కి ఇంటినుంచి బయలుదేరారు.












Click it and Unblock the Notifications