మోడీ అవినీతికి పాల్పడ్డారా?: రాహుల్‌ను నిలదీసిన కేజ్రీవాల్
ప్రధాని మోడీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడినట్లు రాహుల్‌గాంధీ దగ్గర రుజువులు ఉంటే వాటిని ఎందుకని పార్లమెంటు బయట బహిర్గతం చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడినట్లు రాహుల్‌గాంధీ దగ్గర రుజువులు ఉంటే వాటిని ఎందుకని పార్లమెంటు బయట బహిర్గతం చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. బిజెపి, కాంగ్రెస్ మధ్య స్నేహపూర్వక ఒప్పందం ఉందని ఆరోపించారు.
అంతేగాక, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్, సహారా/బిర్లా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి, ఒకరి తప్పులు మరొకరు కప్పిపుచ్చుకుంటున్నారని ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. నోట్ల రద్దుపై వ్యాపారులు బిజెపిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.

బిజెపి తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుందని, తాము వేసిన ఓట్ల ద్వారా గెలుపొంది, తమనే దొంగలని అంటోందని వ్యాపారులు బిజెపిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ బాధ్యతలు నిర్వహించిన సమయంలో అవినీతికి పాల్పడ్డారని తన వద్ద పత్రాలు ఉన్నాయని కేజ్రీవాల్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications