Delhi CM: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. 15 మంది ఎమ్మెల్యేలతో జాబితా సిద్ధం!
Delhi CM: 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలలో విజయం సాధించింది.ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలను కమలం పార్టీ మొదలుపెట్టింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలిసింది. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 19 లేదా 20న జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభా పక్ష సమావేశం ఫిబ్రవరి 17 లేదా 18న జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగించికుని ఇవాళ లేదా రేపు ఉదయానికి ప్రధాని ఢిల్లీకి రానున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో చర్చలు జరిపి ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ పదవులకు ఎంపిక చేస్తారు.

ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా ఆ పార్టీ కీలక నాయకులు పరాజయం పాలయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రభుత్వ అధిపతిని నిర్ణయించడానికి ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించింది. ఐదుగురు నాయకులు కీలక పోటీదారులుగా ఉద్భవించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడేవారి జాబితాలో ముందున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేసిన సీనియర్ బీజేపీ నేత విజయేందర్ గుప్తా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కీలక బ్రాహ్మణ నేత సతీష్ ఉపాధ్యాయ్, కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశిష్ సూద్, వైశ్య సమాజానికి చెందిన ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ ఇతర పోటీదారులుగా ఉన్నారు.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications