40ఏళ్ల తర్వాత మాజీ రైల్వే మంత్రి హత్యకేసులో దోషులును గుర్తించిన ఢిల్లీ కోర్టు

Delhi Court Convicts 4 for Murder of Ex-Railway Minister LN Mishra
న్యూఢిల్లీ: మాజీ రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా హత్యకేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు సోమవారం నలుగురిని దోషులుగా గుర్తించింది. బీహార్‌లో 40 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఈ కేసు విచారణ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

ఈ కేసులో నలుగురిని దోషులుగా పేర్కొన్న ఢిల్లీ కోర్టు డిసెంబర్ 15న శిక్షను ఖరారు చేయనుంది. 1975 జనవరి 2న సమస్థిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి మిశ్రా హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో తీవ్ర గాయాలతో మంత్రి మరణించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సుదీర్ఘ విచారణ నిర్వహించారు. ఈ సమయంలో 161 ప్రాసిక్యూషన్ సాక్షులు, మరో 40 మంది డిఫెన్స్ సాక్షులను విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నన్యాయవాది రంజన్ ద్వివేది వయసు అప్పట్లో 24 ఏళ్లు. ఈయనతో పాటు మరో నలుగురుని దోషులుగా ప్రకటించింది.

ఈ నలుగురిలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురు సంతోషానంద అవధూత, సుదేవానంద అవధూత, గోపాల్‌జీ‌లుగా న్యాయస్ధానం పేర్కొంది. ఈ మర్డర్ కేసులో ఇప్పటికే నిందితులు అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టుని ఆశ్రయించగా తిరస్కరించింది.

పాట్నాలోని సీబీఐ కోర్టులో నవంబర్ 1, 1977న ఛార్జ్‌షీట్ నమోదైంది. అప్పటి అటార్నీ జనరల్ కోరిక మేరకు ఈ కేసును 1979లో ఢిల్లీకి మార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+