ప్రమాదం జరిగితే: టెక్కీ ఫ్యామిలీపై ఆటోడ్రైవర్ దారుణం

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం జరిగింది. తన ఆటోకు ప్రమాదం జరిగిన సమయంలో.. అందులోని ప్రయాణీకులకు సంబంధించిన డబ్బును, ఇతర ఖరీదైన వస్తువులను ఓ ఆటో డ్రైవర్ దొంగిలించికుపోయాడు. ఆటోలో ఉన్న సాఫ్టువేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలైనా ఆ డ్రైవర్ పట్టించుకోలేదు.

ఈ షాకింగ్ సంఘటన ఢిల్లీలో శుక్రవారం నాడు జరిగింది. బీహార్‌లో ఛాత్ పూజ అనంతరం సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో వేలాది మంది ఢిల్లీకి వస్తున్నారు. అలా తిరిగి వస్తున్న వారిలో సుబోధ్ శ్రీవాత్సవ్ (42) ఉన్నారు. అతనితో పాటు భార్య సుష్మ, తనయుడు ప్రియన్ ఉన్నారు.

వారు శుక్రవారం రాత్రి ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో దిగారు. ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో ఉంటున్న.. వారు ఓ ఆటో రిక్షాను మాట్లాడుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి అరగంట ప్రయాణం అనంతరం.. ఆటో పదిహేను కిలోమీటర్ల దూరం పోయింది. డ్రైవర్ అతివేగంగా ఆటో నడుపుతున్నాడు.

Delhi: Engineer dies in auto crash, driver robs belongings and flees

అదుపు తప్పిన ఆటో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, సాఫ్టువేర్ ఇంజినీర్ శ్రీవాత్సవ్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. భార్య, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆటో డ్రైవర్ ఆదుకోలేదు.సరికదా, వారి వద్ద ఉన్న బ్యాగులు, లాప్‌టాప్ ఎత్తుకుపోయాడు.

ఆటో డ్రైవర్ చాలా వేగంగా వెళ్తున్నాడని, తన భర్త అతనిని రెండుమూడుసార్లు అలా వేగంగా వెళ్లవద్దని వారించాడని, కానీ ఆ డ్రైవర్ వినలేదని, అతివేగం వల్ల డివైడర్ ఢీకొట్టాడని శ్రీవాత్సవ్ సతీమణి సుష్మ (40) చెప్పారు. ఆ డ్రైవర్ తమ వస్తువులు తీస్తుంటే, సాయం చేస్తున్నాడనుకున్నామని, కానీ వాటిని తీసుకొని ఆటోలో పారిపోయాడని చెప్పారు. సుష్మ, కొడుకు ప్రియన్ కోలుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+