వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవ్ టీజింగ్ కేసు: రాజకీయ రంగు పడింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమ్మాయిలను వేదిస్తున్నారని ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి బుక్ చేయించిన యువతి రాజకీయ దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అమ్ ఆద్మీ పార్టీ నేతలు కావాలని యువతి దగ్గర ఈ నాటకం ఆడించారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని తిలక్ నగర సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ లో తనను వేధించారని ఢిల్లీ యూనివర్శిటి విద్యార్థిని జాస్లీన్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

యువతి ఇచ్చిన ఫోటోల ఆదారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సన్ని అనే యువకుడిని అరెస్టు చేశారు. సోమవారం అతనికి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే కేవలం యువతి జాస్లీన్ కౌర్ కు పబ్లిసిటి తెప్పించడానికి ఆప్ నాయకులు ఈ డ్రామా ఆడారని బీజేపీ ఆరోపించింది.

Delhi eve-teasing case: Sunny was released on bail late last night.

జాస్లీన్ కౌర్ ఆప్ కార్యకర్త అని గుర్తు చేశారు. జాస్లీన్ కౌర్ ను అందరూ గుర్తు పట్టాలని, ఆమెను వీరవనిత అని పొగడాలని, అందుకు పబ్లిసిటి కావాలని, అందు వలనే అమాయకుడిని బలి చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అదే విదంగా సన్ని తల్లిదండ్రులు వేరువేరుగా జాస్లీన్ కౌర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సన్ని అమాయకుడని, ఇంత వరకు అతను అమ్మాయిల వెంటపడినట్లు ఎవ్వరు చెప్పలేదని, కావాలంటే విచారణ జరిపించాలని పోలీసులకు మనవి చేశారు.

పోలీసులు సైతం రెండు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం జాస్లీన్ కౌర్ నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ మండిపడింది. తాము పబ్లిసిటి కోసం పని చెయ్యడం లేదని ఆప్ నాయకులు బీజేపీపై ఎదురుదాడికి దిగారు.

English summary
Delhi University student Jasleen Kaur was abused at a traffic signal in Tilak Nagar area in Delhi at around 8 pm on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X