కేజ్రివాల్ కిసాన్ ర్యాలీ: రైతు ఆత్మహత్య, ఉద్రిక్తత
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెడుతున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్(ఆప్) అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలో చేపట్టిన కిసాన్ ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్న సమీపంలోని ఓ చెట్టు ఎక్కిన సదరు రైతు, చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
గమనించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అతడ్ని వెంటనే కిందికి దించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సదరు రైతు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అరవింద్ కేజ్రివాల్ కూడా ఆస్పత్రికి వచ్చారు.

కిసాన్ ర్యాలీ
కేంద్రం ప్రవేశపెడుతున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్(ఆప్) అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలో చేపట్టిన కిసాన్ ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కిసాన్ ర్యాలీ
కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్న సమీపంలోని ఓ చెట్టు ఎక్కిన సదరు రైతు, చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

కిసాన్ ర్యాలీ
గమనించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అతడ్ని వెంటనే కిందికి దించారు.

కిసాన్ ర్యాలీ
హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సదరు రైతు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అరవింద్ కేజ్రివాల్ కూడా ఆస్పత్రికి వచ్చారు.
మృతుడ్ని గజేంద్రగా గుర్తించారు. అతడు రాసిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తాను ఓ రైతు కొడుకునని, రాజస్థాన్‌లోని నంగల్ ఝాల్వార్ ప్రాంతానికి చెందినవాడినని అందులో పేర్కొన్నాడు.
తన పంట మొత్తం సర్వనాశనం కావడంతో తన తండ్రి ఇంట్లోంచి గెంటేశారని నోట్‌లో తెలిపాడు. తనకు ముగ్గురు పిల్లలున్నా.. చేయడానికి పనేమీ లేదని, ఇప్పుడు ఇక ఇంటికి ఎలా వెళ్లాలో మీరే చెప్పాలని ఆ లేఖలో అతడు ప్రశ్నించాడు. కాగా, రైతు మృతితో కిసాన్ ర్యాలీ కొంత ఉద్రిక్తంగా మారింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications