సివిల్ సర్వీస్ ఫలితాలు వచ్చేశాయ్.. టాపర్లు వీరే..
సివిల్ సర్వీసెస్ 2015 ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం యూ.పీ.ఎస్.సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. కాగా.. గత సంవత్సరం డిసెంబర్ 18 నుంచి 23 వరకు యూ.పీ.ఎస్.సీ సివిల్ మెయిన్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. యూ.పీ.ఎస్.సీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఏపీలోని విశాఖకు చెందిన చేకూరి కీర్తికి 14వ ర్యాంకు దక్కగా, హైదరాబాద్ కు చెందిన విద్యాసాగర్ నాయుడుకు 101వ ర్యాంకు, జొన్నలగడ్డ స్నేహజకు 103వ ర్యాంకు దక్కింది. ఇక సివిల్స్ టాపర్ల వివరాలను గమనిస్తే.. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల టినా డబి (రోలో నంబర్-0256747), కాశ్మీర్ కు చెందిన 23 ఏళ్ల అమిర్ ఉయు షరి ఖాన్ అఖ్తర్ (రోల్ నంబర్-0058239), జస్మీత్ సింగ్ సంధు(00105512) మొదటి మూడు స్థానాలను వరుసగా కైవసం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications