వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలుష్యం ఎఫెక్ట్....! స్కూల్స్ బంద్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే... దీంతో కాలుష్య ప్రభావం విద్యార్థులపై పడకుండా అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అయిదు రోజులపాటు స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. కాలుష్యం లెవల్స్‌ పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నవంబర్ అయిదు వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయించారు. కాగా ఇప్పటికే విద్యార్థులు కాలుష్యం భారిన పడకుండా వారికి మాస్క్‌లు అందించారు. కాని పరిమితికి మించి కాలుష్యం పెరగడంతో పూర్తిగా స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాలుష్యం చంపేస్తుంది: ఈ రాష్ట్రాల్లో నివసిస్తుంటే ఏడేళ్ల ముందే జీవితం ఫినిష్కాలుష్యం చంపేస్తుంది: ఈ రాష్ట్రాల్లో నివసిస్తుంటే ఏడేళ్ల ముందే జీవితం ఫినిష్

ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల పట్టణాలు కాలుష్య కొరల్లో చిక్కుకున్నాయి. చలికాలం కావడం, మరోవైపు ఇటివల జరిగిన దీపావళీ పండగ సంధర్భంగా మరింత కాలుష్యం పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యం భరించలేని స్థాయిలో పెరగడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెల్త్ ఎమెర్జెన్సిని ప్రకటించారు.

Delhi government ordered to the schools closed

దీంతో ఢిల్లీ నగరంలో పలు నిర్మాణల పాటు ఇతర మందుగుండు సామాగ్రి పేల్చడంపై కూడ అయిదురోజుల పాటు నిషేధం విధించారు. అయితే ఈ కాలుష్యానికి కారణం పక్కరాష్ట్రాల రైతులు అంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. రైతులు పంట అనంతరం చెత్తను కాల్చడం ద్వార కాలుష్యం విపరీతంగా పెరిగిందని అన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిపై చర్యలు చేపట్టాని ఆయన కోరారు.

English summary
Delhi government orderd to the schools close as air pollution levels kept incresing to touch the severe plus category.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X