వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్లీ: ‘రోడ్డుపై ఆమె శరీరం నగ్నంగా ఉంది.. ప్రమాదమే అయితే ఇలా ఎలా జరుగుతుంది?’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దిల్లీలో కొత్త సంవత్సరం రోజు (ఆదివారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి బంధువులు, పొరుగువారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసుల విచారణపై ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.

బాధితురాలి బంధువులతో పాటు పలువురు దిల్లీలోని సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు ఢీకొన్న తర్వాత యువతి మృతదేహం కారు కింద ఇరుక్కుపోయింది. అలాగే కొన్ని కిలోమీటర్ల మేర రోడ్డుపై యువతిని కారు ఈడ్చుకెళ్లింది.

ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వెంటనే దిల్లీలోని మంగోల్‌పురిలోని ఎస్‌జీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

అవుటర్ దిల్లీ డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి శరీరం వెనుక భాగం, తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న''రేప్, మర్డర్’' వాదనలను ఆయన తోసిపుచ్చారు. ''ఇది కేవలం ప్రమాదం కేసు. బాధితురాలిపై లైంగిక వేధింపులు జరగలేదు" అని స్పష్టం చేశారు.

ఈ కేసులో అయిదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ హరేంద్ర సింగ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు హరేంద్ర సింగ్ తెలిపారు.

ఈ విషయంపై దృష్టి సారించిన దిల్లీ మహిళా కమిషన్, దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

కారు ప్రమాదం

అసలు ఏమైంది?

ఆదివారం (జనవరి 1) ఉదయం 3.24 గంటలకు ఒక మహిళను కారు ఈడ్చుకెళ్తున్నట్లు తమకు సమాచారం అందిందని కంఝవాలా పోలీసులు చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 'తెల్లవారుజామున ఉదయం 4.11 గంటలకు రోడ్డుపై యువతి మృతదేహం పడి ఉందని మరో కాల్‌ వచ్చింది.

రోహిణి జిల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని మంగోల్‌పురిలోని ఎస్‌జీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. స్కూటీ ప్రమాదానికి గురైందని అక్కడి ఎస్‌హెచ్‌ఓకు తెల్లవారుజామున 3.53 గంటలకు సమాచారం వచ్చింది.

డీసీపీ హరేంద్ర సింగ్ ఏం చెప్పారు?

అవుటర్ దిల్లీ డీసీపీ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ, ''ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది దురదృష్టకర ప్రమాదం.

వాహనాన్ని ఆపి బాధితురాలికి సహాయం చేయడానికి బదులుగా, కారు డ్రైవర్ అలాగే ఈడ్చుకుంటూ వెళ్లాడు.

బాధితురాలు వాహనం కింద ఉన్నట్లు తొలుత తెలిసి ఉండకపోవచ్చు. కానీ తెలిసిన తర్వాత కూడా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

ఆ సమయంలో కారులో పెద్దగా మ్యూజిక్ పెట్టినట్లు నిందితులు తెలిపారు. ఘటనా సమయంలో నిందితులు మద్యం తాగి ఉన్నారా? లేదా? అనే అనే కోణంలో దర్యాప్తు చేస్తాం.

నిందితులు చెప్పిన విషయాలను శాస్త్రీయ, ఫోరెన్సిక్ ఆధారాలతో సరిచూస్తాం.

ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. కారుతో పాటు మృతదేహం ఈడ్చుకెళ్లడం చూసిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

https://twitter.com/ANI/status/1609536753588908032

కారు నంబర్ ఆధారంగా నిందితులను కనుగొన్నాం. ఘటన సమయంలో కారు యజమాని అందులో లేరు. అతని స్నేహితులు ఉన్నారు. వారి ఇళ్ల నుంచి నిందితులను అరెస్ట్ చేశాం.

చాలా దూరం వెళ్లాక కారుతో పాటు మృతదేహం ఈడ్చుకెళ్లినట్లు తెలిసిందని నిందితులు తెలిపారు. అప్పుడు కారును వెనక్కి నడపడంతో మృతదేహం కారు నుంచి విడిపోయి కిందపడిందని వారు చెప్పారు.

మృతురాలి శరీరంపై దుస్తులు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా వ్యాప్తి చెందుతున్న ఫొటోలలో కూడా ఆమె కాళ్లకు దుస్తులు ఉండటం మీకు చూడొచ్చు.

ఎలాంటి ఆధారాలు లేకుండా యువతిపై లైంగిక దాడి జరిగిందని చెప్పడం సరి కాదు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కనబడుతున్న ఫొటోలు, వీడియోలు కేవలం శరీరం ముందు భాగానివి మాత్రమే. ఆమె శరీరం వెనుకవైపు ఫొటోలు మా దగ్గర ఉన్నాయి. వాటిని మీరు చూడలేరు. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల వెనుక భాగం అంతా చితికిపోయింది. అలాంటి పరిస్థితుల్లో శరీరంపై దుస్తులు పద్ధతిగా ఉండటం అసంభవం. మేం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె దుస్తులు చిరిగిపోయే ఉన్నాయి. కానీ, సోషల్ మీడియాలో దీన్ని తప్పుగా చూపిస్తున్నారు. ఇది ప్రమాదానికి సంబంధించిన కేసు మాత్రమే. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన వివరించారు.

దిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఏం అన్నారు?

దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తూ మహిళల భద్రతపై ప్రశ్న లేవనెత్తారు.

''దిల్లీ వీధుల్లో మద్యం మత్తులో ఉన్న అబ్బాయిలు ఒక అమ్మాయిని కారుతో అనేక కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా కనిపించింది. ఇది చాలా భయంకరమైన కేసు. దిల్లీ పోలీసులకు సమన్లు ఇచ్చాం. ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగింది? ఆమెకు ఎలా న్యాయం చేస్తారనేది మాకు చెప్పాలని వారిని కోరాం.

కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని దిల్లీ పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారో చెప్పాలి. కిలోమీటర్లు మేర అమ్మాయి మృతదేహాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారంటే మధ్యలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయలేదా? మద్యం తాగి వారు వాహనాలు ఎలా నడుపుతారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా? దిల్లీలో పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఇది చాలా భయంకరమైన విషయం. దిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు సమన్లు జారీ చేసింది. దీనిపై వెంటనే చర్య తీసుకోవాలి.

https://twitter.com/SwatiJaiHind/status/1609527617249759233

కారు ప్రమాదం

బాధితురాలి తల్లి ఆరోపణలు

మృతురాలి తల్లి మాట్లాడుతూ, ''నా కూతురే నాకు సర్వస్వం. ఇంట్లో సంపాదించేది, మమ్మల్ని చూసుకునేది కూడా తనే. రెండేళ్లుగా నేను అనారోగ్యంతో ఉన్నా. నా కిడ్నీ పాడైంది. నాకు నా కూతురు తప్ప మరో అండ లేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా గతి ఏంటి? నాకు నా కూతురు కావాలి.

శనివారం సాయంత్రం పంజాబీ బాగ్‌లో తను పనికి వెళ్ళింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో నా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి 10 గంటలకల్లా ఇంటికి వస్తానని చెప్పింది. ఉదయం ప్రమాదం గురించి నాకు తెలిసింది’’ అని చెప్పారు.

''నా కూతురిని అయిదుగురు వేధించారు. చంపేసి ఆమెను కారు కింద తోసేశారు.

ఆమె శరీరంపై దుస్తులు లేవు. ఇది యాక్సిడెంట్ అయితే, ఆమె శరీరంపై దుస్తులు ఎందుకు లేవు? ఇది ఎలాంటి యాక్సిడెంట్?’’ అని ఆమె అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

https://twitter.com/ANI/status/1609561633113923585

''ఈ ఘటన సిగ్గు పడేలా చేసింది’’: లెఫ్టినెంట్ గవర్నర్

దిల్లీలో కారుతో యువతిని ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాట్లాడుతూ, ''నేరస్థుల రాక్షస ప్రవర్తనతో దిగ్భ్రాంతి చెందాను’’ అని అన్నారు.

బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందేలా చూస్తామని వీకే సక్సేనా తెలిపారు. బాధ్యతాయుతమైన, సున్నిత సమాజం కోసం పాటుపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delhi: 'Her body is lying naked on the road.. How can this happen if it is an accident?'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X