వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ బయోపిక్ రిలీజ్‌కు లైన్ క్లియర్ : స్టే ఇవ్వాలనే పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్నికల వేళ బీజేపీకి గుడ్‌న్యూస్. బీజేపీ ఆశాదీపం, ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 'PM Narendra Modi' సినిమా విడుదలను నిలిపివేయాలని కొందరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషనర్ వాదనతో న్యాయస్థానం విభేదించింది. సినిమా రిలీజ్‌కు స్టే ఇవ్వబోమని తేల్చిచెప్పింది.

రిలీజ్ వద్దు, ఎందుకంటే ...?

రిలీజ్ వద్దు, ఎందుకంటే ...?

ప్రధాని మోదీ 'PM Narendra Modi' బయోపిక్ మూవీలో లీడ్ రోల్ బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్ నటించారు. ఈ సినిమాపై తొలి నుంచి హైప్ క్రియేట్ అయ్యింది. మోదీ నిజజీవితంలో జరిగిన ఘట్టాలను సెల్యూలాయిడ్‌పై దర్శకుడు ఎలా తీర్చిదిద్దారని సగటు ప్రేక్షకుడు ఎదురుచూశాడు. కానీ ఎన్నికల వేళ మోదీ బయోపిక్ విడుదలైతే బీజేపీకి మేలు జరుగుతోందని కొందరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలను అడ్డుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రిలీజ్‌కు ఓకే

రిలీజ్‌కు ఓకే

'PM Narendra Modi' బయోపిక్ మూవీ విడుదలపై స్టే విధించాలనే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారించింది. సినిమా ప్రభావం ఎన్నికలపై అంతగా ఉండదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనికితోడు మోదీ జీవితచరిత్ర ఎన్నికలపై ఎఫెక్ట్ చూపిస్తోందని భావించలేమని పేర్కొన్నది. ఈ మేరకు 'PM Narendra Modi' మూవీ రిలీజ్ చేయొద్దని పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చుతూ కొట్టివేసింది.

కోర్టు తీర్పుతో బీజేపీ శ్రేణుల హర్షం

కోర్టు తీర్పుతో బీజేపీ శ్రేణుల హర్షం

ప్రధాని మోదీ బయోపిక్‌పై కొందరు కావాలని కోర్టును ఆశ్రయించారని బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ఓర్వలేనితనంతో కోర్టును ఆశ్రయించినా, వారికి చెంపపెట్టు తప్పలేదని విమర్శించారు. మొత్తానికి మోదీ బయోపిక్ రిలీజవనుండటాన్ని వారు స్వాగతించారు.

English summary
Delhi High Court dismisses the PIL seeking stay on release of film 'PM Narendra Modi' during the period of Model Code of Conduct, ahead of Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X