హైడ్రామా: 144 సెక్షన్: సీబీఐ విచారణకు డిప్యూటీ సీఎం: ముఖ్యమంత్రి ప్రార్థనలు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జైలు నుంచి త్వరగా విడుదల కావాలని ప్రార్థిస్తున్నానంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై సీబీఐ విచారణ మరింత ముమ్మరమైంది. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ అధికారులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తోన్నారు. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. మరికొన్ని అరెస్టులు కూడా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

తాజాగా- ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ఇదివరకే ఆయనను విచారించారు కూడా. ఇవ్వాళ మరోసారి మనీష్ సిసోడియాను విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Delhi liquor policy: Manish Sisodia reaches CBI office, I pray that you return from jail soon, Kejriwal tweet

ఈ క్రమంలో ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణకు బయలుదేరి వెళ్లడానికి ముందు మనీష్ సిసోడియా నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు. మనీష్ సిసోడియాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీజేపీ, సీబీఐకి వ్యతిరేకంగా నినదించారు.


తన మద్దతుదారులతో కలిసిన అనంతరం నివాసం నుంచి నేరుగా రాజ్ ఘాట్ కు బయలుదేరి వెళ్లారు. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడే మౌనంగా గడిపారు. ఆ సమయంలో ఆయన వెంట ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాత్రమే ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు రాజ్ ఘాట్ లో గడిపిన అనంతరం మనీష్ సిసోడియా.. సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ పరిణామాలన్నింటిపైనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సంచలన ట్వీట్ చేశారు. జైలు నుంచి త్వరగా విడుదల కావాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం ఖాయం కావడం వల్లే అరవింద్ కేజ్రీవాల్ ఇలా స్పందించారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో ఢిల్లీ దక్షిణ జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ ను విధించడం కూడా మనీష్ సిసోడియా అరెస్ట్ తప్పకపోవచ్చనే సందేశాన్ని పంపించినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+