వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓపెన్ డోర్లతో నడిచిన ఢిల్లీ మెట్రో రైలు: సస్పెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెండు స్టేషన్ల మధ్య వేగంగా పరుగు తీస్తున్న సమయంలో రెండు నిమిషాల పాటు ఢిల్లీ మెట్రో రైలు తలుపులు తెరిచే ఉన్నాయి. హుడా సిటీ సెంటర్, జహీంగీర్‌పీర్ మధ్య మెట్రో రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన గురువారంనాడు జరిగింది.

మెట్రో రైలు ఎడమ పక్క అన్ని తలుపులూ రెండు నిమిషాల పాటు తెరిచే ఉన్నాయి. తెరిచిన తలుపులతోనే రైలు అర్జన్‌గడ్ నుంచి బయలుదేరింది. తర్వాతి స్టేషన్ ఘితోర్నికి వచ్చిన తర్వాత తలుపులు మూసేశారు.

Delhi Metro runs with open doors for 2 minutes; engine operator suspended

ఆ సంఘటనపై డిఎంఆర్‌సి విచారణకు ఆదేశించింది. రైలు ఆపరేటర్ తప్పిదం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు చెప్పారని సిఎన్ఎన్ - ఐబిఎన్ రాసింది.

ప్రయాణికులు ఎవరు కూడా ఈ సంఘటనలో గాయపడలేదని తెలుస్తోంది. దానికి తోడు, రైలు షెడ్యూల్‌లో ఏ విధమైన తేడా రాలేదని అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.

English summary
Doors of a Delhi Metro train on Thursday morning remained open even while it was speeding between two stations on the yellow line that runs between Huda City Centre and Jahangirpuri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X