హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం (Video)

Posted By:
Subscribe to Oneindia Telugu
  Delhi-NCR's Dangerous Mishaps : Beware Of Pollution

  ఢిల్లీ: డిల్లీని దట్టమైన పొగమంచు వణికిస్తోంది. పొగమంచు కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగ్రా - నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వే జాతీయ రహదారిపై ఈ ఉదయం పొగ మంచు కారణంగా భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన మంచు కారణంగా 13 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకున్నాయి. ప్రమాదం కారణంగా హైవేపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడి.. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి..సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్దరిస్తున్నారు.

  చాలామంది మెట్రోకు బదులుగా కార్లలో ప్రయాణిస్తుండగా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఉదయం 7 గంటలకు పొగమంచు దట్టంగా ఉండటంతో రోడ్డు కనబడే అవకాశం చాలా తక్కువగా ఉన్నందువల్ల డ్రైవర్లు ఫాగ్ లైట్లతో డ్రైవింగ్ చెయ్యడం చాలా అవసరం.

  Delhi-NCR's Dangerous Mishaps : Beware Of Pollution & Smog

  ఇక ఇప్పటికే రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సుప్రీంకోర్టు మద్యం షాపులపై కొరడా ఘలిపించిన విషయం తెలిసిందే. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా డ్రైవింగ్ చేసేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారుల పైన ఔటర్ రింగ్ రోడ్ల పైన ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపధ్యంలో జాగ్రతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  ఇక ఢిల్లీలో కాలుష్యం పరిస్థితి మారడం లేదు. కాలుష్యం స్థాయిలు ఏమాత్రం తగ్గడం లేదు. వాయు కాలుష్యం ఢిల్లీ నగరాన్ని ముంచెత్తుతోంది. ఇప్పుడున్న గాలి పీలిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. గాలిలో కాలుష్యం 100 రీడింగ్‌ను దాటితేనే సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ప్రమాదకరంగా పరిగణిస్తుంది. ఈ రీడింగ్ గరిష్ఠంగా డిల్లీ లో 500 వరకూ ఉంటుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  18 cars rammed into each other on the Agra-Noida Yamuna Expressway due to low visibility. Speeding cars rammed into one another, while people on the footpath were shouting and requesting the drivers to slow down. 18 cars collide on Yamuna highway due to Delhi-NCR's dangerous smog.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి