దేశ రాజధానిలో కరోనా ఆంక్షల సడలింపు: ఆఫ్‌లైన్ క్లాసులు మాత్రమే, నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. దేశ రాజధానిలోనూ ఆంక్షలు సడలించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) ఢిల్లీలో అన్ని కోవిడ్-19 ఆంక్షలను ఎత్తివేసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో, పాజిటివిటీ రేటు 1 శాతం కంటే తక్కువగా ఉన్నందున సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూతో సహా పరిమితులను ఎత్తివేయాలని డీడీఎంఏ నిర్ణయించింది.

కొత్త ఉత్తర్వులు ఏప్రిల్ 1 నుంచి ఫిజికల్ క్లాస్‌లకు తిరిగి రావాలని విద్యార్థులను కోరింది. ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడిన తర్వాత పాఠశాల అధికారులు ఆన్‌లైన్ తరగతులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇతర ఉపశమనాలతో పాటు, మాస్కులు ధరించనందుకు ప్రభుత్వం జరిమానాను రూ. 500కి తగ్గించింది. రెస్టారెంట్లు, బార్‌లలో 50 శాతం సామర్థ్య నియమాన్ని కూడా తొలగించింది. పరిమితులు ఎత్తివేయబడినప్పటికీ, మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని నిర్వహించడం, పరీక్షలు, టీకాలు వేయడం వంటి తగిన కోవిడ్-19 ప్రవర్తనను అనుసరించాల్సి ఉంటుంది.

Delhi: Only Offline Classes In Schools From April 1, All Restrictions Withdrawn, No Night Curfew

శుక్రవారం జరిగిన డీడీఎంఏ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ గెహ్లాట్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ వార్తలను ధృవీకరించారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో.. నగరంలో కోవిడ్ పరిస్థితి మెరుగుపడినందున, ఉద్యోగ నష్టం కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకే పరిమితులను సడలించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ చెప్పారు.

దేశవ్యాప్తంగా తగ్గుతున్న కేసుల దృష్ట్యా కోవిడ్ నియంత్రణలను సడలించడం గురించి ఆలోచించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను శుక్రవారం కోరిన కొద్ది గంటల తర్వాత ఢిల్లీలో నిబంధనలను సడలించే నిర్ణయం వచ్చింది. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. తాజాగా, కొత్త కేసులు 13వేలకు దిగొచ్చాయి. గురువారం 10 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 13,166 మందికి కరోనా సోకినట్లు తేలింది. గత 24 గంటల్లో 302 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,34,235 యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+