లిమ్కా బుక్ రికార్డుకెక్కిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద నగదు చోరీని ఛేదించినందుకు ఢిల్లీ పోలీసులు లిమ్కా బుక్ రికార్డుకెక్కారు. గత నవంబరు 27న ఓ నగదు తరలింపు వాహనం నడిపే డ్రైవరు రూ.22.50 కోట్ల డబ్బుతో పరారయ్యాడు.
దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి పది గంటల్లోనే ఆ వాహనాన్ని పట్టుకోగలిగారు. ఇందులో రూ.10,500 తప్ప మిగిలిన డబ్బంతా అలాగే ఉంది. ఈ డబ్బును డ్రైవరు ఖర్చులకు ఉపయోగించుకున్నాడని పోలీసులు చెప్పారు.
DP enters the Lima Book of Records for making India's largest ever cash recovery of ₹22.49 Crores of stolen money. pic.twitter.com/aXcOoHD3ky
— BS Bassi (@BhimBassi) January 2, 2016 తమకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దక్కడంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో దోపిడీకి గురైన భారీ మొత్తం రూ. 22.49కోట్లను గంటల్లోనే ఛేధించినందుకు ఈ అవార్డు వచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications