లైంగిక వేధింపులు: పచౌరీపై ఛార్జీషీటు దాఖలు
న్యూఢిల్లీ: ది ఎనర్జీ, రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(తేరి) ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఆర్కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు. తేరీలో గతంలో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఆమె గౌరవానికి భంగం కలిగించారని ఆయనపై ఆరోపణలున్నాయి.
కాగా, మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ వద్ద 1400 పేజీలతో కూడిన ఈ ఛార్జీషీటును పోలీసులు దాఖలు చేశారు.
తేరిలో ప్రస్తుతం పని చేస్తున్న, గతంలో పని చేస్తున్న, గతంలో పని చేసిన ఉద్యోగులలో సుమారు 23మందిని పోలీసులు ప్రాసిక్యూషన్ తరపు సాక్షులుగా పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 354, 354ఎ, 354డి, 506, 509 కింద పచౌరీపై ఆరోపణలు నమోదయ్యాయి.

కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే కోర్టు కేసులు ఎదుర్కొంటున్న రాజేంద్ర కె పచౌరిపై తాజాగా మరో మహిళ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి తేరిలో 2003లో చేరింది. అప్పుడు పచౌరి ఆ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
పదేళ్ల క్రితం తాను తేరిలో పని చేసినప్పుడు ఎదురైన చేదు అనుభవాలను ఆ మహిళ మీడియాకు వివరించింది. చర్చించడానికి ఎలాంటి విషయం లేనప్పటికీ ఏదో ఒక సాకు చూపించి పచౌరి తనను తన గదికి పిలిచేవాడని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేదని, అందుకే తాను కొన్ని సమావేశాలను తప్పించుకోవడమో లేదా ఆ సమావేశాలకు వెళ్లమని తన కోలీగ్స్‌కు చెప్పడమో చేసేదాన్నని చెప్పింది.
పచౌరి వ్యక్తిత్వం, మహిళా ఉద్యోగుల పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉండేదో లోకానికి చూపించడానికి ప్రస్తుతం ఆయనపై జరుగుతున్న కేసులో తానే ఒక సాక్షిగా హాజరుకావాలని అనుకుంటున్నట్లు కూడా ఆమె చెప్పింది. ఒకసారి తాను పచౌరి గది నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బలవంతంగా కౌగలించుకుని ముఖంపై ముద్దు పెట్టుకున్నారని ఆమె తెలిపింది.
ఆ సంఘటనతో దిగ్భ్రాంతికి గురయిన తాను వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశానని, తన రాజీనామా లేఖను చూసినప్పుడు పచౌరి నువ్వు ఎలా ఉద్యోగం వదిలిపెడతావో చూస్తానని బెదిరించారని కూడా ఆమె తెలిపింది. అయితే, ఆమె ఆరోపణలు అవాస్తవమని పచౌరీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications