భార్య చిలకొట్టుడికి భర్త చెవి తెగి నేలమీదపడింది, నన్ను కాపాడతారా లేదంటే ?, మ్యాటర్ !

దంపతుల మద్య గొడవలు జరగడం, ఒకరిని ఒకరు కొట్టుకోడం, తరువాత ఇద్దరూ ఒక్కటి అయిపోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగిన గొడవలో కోపంతో ఓ భార్య ఆమె భర్త చెవి సూర్తిగా కొరికిన ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఆ గొడవలో నా భార్య కొరికిన కొరుక్కు నా కుడి చెవి పైభాగం పూర్తిగా తెగిపోయిందని, నా భార్య నుంచి నన్ను మీరే కాపాడాలని భర్త పోలీసులను ఆశ్రయించాడు.

తానకు శస్త్రచికిత్స చేసుకోలుకోవాల్సి వచ్చిందని ఫిర్యాదు చేసిన 45 ఏళ్ల వ్యక్తి చెప్పాడని పోలీసులు అన్నారు. చికిత్స పొందిన అనంతరం భార్యపై ఆమె భర్త ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. పలు సెక్షల కింద భార్య మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని, భర్త లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Delhi Police has registered an FIR against the wife who bit her husbands ear due to a family quarrel

పోలీసుల కథనం ప్రకారం ఉదయం 9. 30 గంటల ప్రాంతంలో ఇంటి బయట చెత్త వేయడానికి భర్త వెళ్లాడు. ఆ సమయంలో ఇంటిని శుభ్రం చేయమని భార్యను ఆమె భర్త అడిగాను. తరువాత భార్య ఇంటిని శుభ్రం చెయ్యలేదని తెలిసింది. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే నా భార్య నాతో అనవసర విషయాలపై గొడవ పెట్టుకుందిని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. పిల్లలతో ఒంటరిగా ఉండేందుకు ఇంటిని అమ్మి వాటా ఇవ్వాలని భార్య పదే పదే తనను వేధిస్తున్నదని ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు.

నేను ఆమెకు ఇల్లు అమ్మడం కుదరదనే విషయాన్ని వివరించడానికి ప్రయత్నించాను, కానీ ఆ సందర్బంలో ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగిందని, తరువాత తన భార్య తనను కొట్టడానికి ప్రయత్నించింది, ఆ సమయంలో నేను ఆమెను దూరంగా నెట్టివేసానని, నేను ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు ఆమె నన్ను వెనుక నుండి పట్టుకుని కోపంతో నా కుడి చెవిని కొరికిందని భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Delhi Police has registered an FIR against the wife who bit her husbands ear due to a family quarrel

దీంతో నా చెవి పై భాగం తెగిపోయి కిందపడిపోయిందని భర్త పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో నా కొడుకు నన్ను మంగోల్‌పురిలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడని, అక్కడి వైద్యుల సలహామేరకు రోహిణి ఏరియాలోని జైపూర్‌ గోల్డెన్‌ హాస్పిటల్‌లో సర్జరీ చేయాల్సి వచ్చింది భార్య దెబ్బకు భయపడిపోయిన భర్త సమాచారం ఇచ్చాడని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ఆసుపత్రి నుంచి తమకు సమాచారం అందిందని, దీనిపై విచారణకు బృందాన్ని పంపామని పోలీసులు అధికారులు తెలిపారు. బాధితుడు అస్వస్థతతో ఉన్నందున వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి లేదని, వాంగ్మూలం ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు అతని భార్యకు సూచించారు. భర్త పోలీసులకు ఇచ్చిన లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేశామని, ఈ విషయంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+