సునంద మృతి: పాక్ జర్నలిస్ట్‌ను విచారించనున్న పోలీసులు, భారత్ రానని మెహర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌ను ప్రశ్నించనున్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ గురువారం ఈ విషయమై మాట్లాడారు.
తాము మెహర్ తరర్‌తో మాట్లాడుతామని, ఈ కేసులో ఆమె కూడా ముఖ్యమైన వ్యక్తి అన్నారు. కాగా, సునంద పుష్కర్, శశిథరూర్ మధ్య విభేదాలకు మెహర్ తరర్ అనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.

మెహర్ తరర్ మాట్లాడుతూ.. తాను విచారణ కోసం భారత్‌కు రానని, విచారణాధికారులే పాకిస్తాన్ రావొచ్చునని చెప్పింది. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపింది. తాను ఎప్పుడైనా సిద్ధమని చెప్పింది. అయితే, తాను భారత దేశానికి రానని చెప్పింది. భారత విచారణాధికారులు లాహోర్‌కు మాత్రం రావొచ్చునని చెప్పింది.
సునంద పుష్కర్‌తో ట్విట్టర్‌లో గొడవ పడడమే తాను చేసిన పెద్ద తప్పు అని ఆమె వాపోయింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది త్వరలో ముగిసిపోతుందని తాను విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని చెప్పింది.












Click it and Unblock the Notifications