టీటీవీ దినకనర్ కు ఢిల్లీ పోలీసుల సమన్లు: ఇంటి ఎదుట ఆత్మాహుతియత్నం!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ఇక టీటీవీ దినకరన్ చెన్నై, ఢిల్లీ కోర్టుల చుట్టూ ప్రదక్షణలు చెయ్యడానికి సిద్దం అయ్యారు.

నిన్నటి వరకు టీటీవీ దినకరన్ ను పొగడ్తలతో ముంచిన అన్నాడీఎంకే నాయకులు ఇప్పుడు తిట్లపురాణం మొదలు పెట్టారు. రెండు నెలలు అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నానా హంగామా చేసిన దినకరన్ ఇప్పుడు సైలెంట్ గా మూల కుర్చోవలసిన పరిస్థితి తెచ్చుకుని జుట్టుపీక్కుంటున్నాడు.

మెడకు వేలాడుతున్న కేసులు

మెడకు వేలాడుతున్న కేసులు

విదేశీ మారక ద్రవ్యంతో పాటు మరి కొన్ని కేసులు టీటీవీ దినకరన్ మెడకు వేలాడుతున్నాయి. ఇంత కాలం విచారణల వేగం మాత్రం వాయిదాల పర్వంతో సాఫిగా సాగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు కేసు విచారణ వేగవంతం కావడంతో దినకరన్ హడలిపోతున్నాడు.

ఈసీ లంచం కేసు చుట్టుకోవడంతో

ఈసీ లంచం కేసు చుట్టుకోవడంతో

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కేటాయించడానికి ఏకంగా ఎన్నికల కమిషన్ కే రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి సిద్దం అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్ ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అంటూ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు.

తప్పించుకునే చాన్స్ లేదు

తప్పించుకునే చాన్స్ లేదు

మొత్తం మీద ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని నమోదైన కేసులో దినకరన్ నేరం చేసినట్లు రుజువు అయితే ఆయన సామాన్యంగా కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణలు అంటున్నారు.

సమన్లు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు

సమన్లు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు

బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంలోని పోలీసు అధికారులు చెన్నైలోని టీటీవీ దినకరన్ ఇంటికి వెళ్లి ఆయనకు సమన్లు ఇచ్చారు. ఆసమయంలో దినకరన్ అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి ముందు గుమికూడారు.

కచ్చితంగా తేల్చిచెప్పిన ఢిల్లీ పోలీసులు

కచ్చితంగా తేల్చిచెప్పిన ఢిల్లీ పోలీసులు

రెండాకుల చిహ్నం కేటాయింపుపై ముడుపుల వ్యవహారంలో నేరుగా విచారణకు హాజరుకావాలని సూచించిన ఢిల్లీ పోలీసులు నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమన్లు తీసుకున్న దినకరన్ కచ్చితంగా విచారణకు ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది.

దినకరన్ మీద ఢిల్లీ నిఘా

దినకరన్ మీద ఢిల్లీ నిఘా

టీవీవీ దినకరన్ పాస్ పోర్టును అధికారులు సీజ్ చేశారు. అయితే తన దగ్గర పాస్ పోర్టు లేనేలేదు అంటున్న దినకరన్ మాత్రం విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. అయితే ఆయన మీద ఢిల్లీ పోలీసులు గట్టి నిఘా వేశారు.

వాంటెడ్ లిస్టులో దినకరన్ పేరు !

వాంటెడ్ లిస్టులో దినకరన్ పేరు !

టీటీవీ దినకరన్ విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ వేసుకున్నారని సమాచారం తెలుసుకున్న అధికారులు వాంటెడ్ లిస్టులో ఆయన పేరు చేర్చేశారు. ఇప్పుడు దినకరన్ తప్పించుకుని పారిపోవడానికి ఎలాంటి అవకాశం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

ఆత్మాహుతి యత్నం

ఆత్మాహుతి యత్నం

బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసులు టీటీవీ దినకరన్ ఇంటి దగ్గరకు వెళ్లి సమన్లు జారీ చేశారు. ఆ సమయంలో దినకరన్ కు సమన్లు జారీ చెయ్యరాదని ఆయన అభిమాని ఆయన ఇంటి ముందే ఆత్మాహుతియత్నం చెయ్యడంతో కలకలం రేపింది. దినకరన్ ఇంటి ముందు ఆత్మాహుతియత్నం చేసిన వ్యక్తిని రాజేంద్రన్ గా పోలీసులు గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi police summons given to TTV dinakaran. Delhi police are watching TTV Dinakaran like a hawk after they came to know that he was planning to flee abroad. A pro Dinakaran supporter attempted for self immolation in his house this night opposing the Delhi police visit.
Please Wait while comments are loading...