దారుణం: ట్రాఫిక్ ఏసీపీ మృతి, విధులు నిర్వహిస్తుండగా కారుతో ఢీ..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన రిగింది. రాజొక్రీ ఫ్లై ఓవర్ వద్ద ఏసీపీ సంకేత్ కౌశిక్ విధులు నిర్వహిస్తున్నారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్‌ను శనివారం నియంత్రిస్తున్నారు. ఇంతలో ఒక కారు వచ్చి ఆయనను ఢీ కొన్నది. వెంటనే అతనిని సమీపంలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కానీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిని కారు ఢీ కొనడం చర్చానీయంశమైంది. అయితే కారు ఎవరు ఢీ కొన్నారు..? కావాలనే అటాక్ చేశారా అనే అంశాలు తెలియాల్సి ఉంది.
Recommended Video
Ambident Fraud Case : గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంతోనే సీసీబీ అధికారుల మీద వేటు | Oneindia













Click it and Unblock the Notifications