రెండో పెళ్లికి అంగీకరించలేదని మహిళ కాల్చివేత

న్యూఢిల్లీ: తనతో రెండో పెళ్లికి అంగీకరించలేదని మహిళపై ఓ ఎస్‌ఐ దారుణానికి ఒడిగట్టాడు. ఢిల్లీలోని పబ్లిక్‌పార్కులో ఆమెను తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆదివారంనాడు తీవ్ర సంచలనం సృష్టించింది.

రాజస్థాన్‌కు చెందిన విజేంద్ర బిష్ణోయి(33) ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 4లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి భార్య రాజస్థాన్‌లో ఉంటున్నది. భర్తతో వేరుపడి ద్వారకా సెక్టార్‌లోనే నివసిస్తున్న నికిత అనే మాజీ రిపోర్టర్‌తో విజేంద్ర మూడేళ్లుగా పరిచయం కొనసాగిస్తున్నాడు.

Delhi Policeman Shoots Woman, Then Kills Himself

తనను వేధిస్తున్నాడంటూ విజేంద్రపై భార్య ఇటీవల గృహ హింస కేసు పెట్టింది. ఇది కొనసాగుతుండగానే అతడు నికితను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆదివారం ఉదయం నికితకు ఫోన్ చేసి స్థానిక పార్కుకు పిలిపించుకున్నాడు.

పార్కులో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రెండో పెళ్లికి నికిత నిరాకరించడంతో విజేంద్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆమెను తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చిచంపాడు. ఆమెతో అతనికి మూడేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఎస్‌ఐగా 2008లో చేరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+