కాంగ్రెస్‌కు గట్టి షాక్, బీజేపీలోకి కేంద్ర మాజీమంత్రి, ఏఏపీ బిన్నీకూడా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బ తలిగింది. కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీర్థ్ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో ఆమె కమల తీర్థం పుచ్చుకున్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.
కృష్ణతీర్థ్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఆమె నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లి, ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించేదాకా ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలియక పోవడం గమనార్హం.
ప్రజల అభిప్రాయాలను గౌరవించి తాను బీజేపీలో చేరుతున్నానని ఆమె తెలిపారు. బీజేపీ కేంద్ర కమిటీ తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు. దళిత ఓటు బ్యాంకును తమ వైపుకు మళ్లించేందుకు బీజేపీ ఆమెను తమ పార్టీలో చేర్చుకొని ఉంటుందంటున్నారు. ఇటీవల బీజేపీలో పలువురు నేతలు చేరుతున్న విషయం తెలిసిందే.

కృష్ణ తీర్థ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బ తలిగింది. కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీర్థ్ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీలో చేరారు.

కృష్ణ తీర్థ
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో ఆమె కమల తీర్థం పుచ్చుకున్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.

వినోద్ కుమార్ బిన్నీ
ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదివారం నాడు బీజేపీలో చేరారు. ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్న బీజేపీ ఢిల్లీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ.

బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదివారం నాడు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎన్నికల్లో తమదే విజయమని విక్టరీ సింబల్ చూపిస్తూ...

కిరణ్ బేడీ
భారతీయ జనతా పార్టీలో కిరణ్ బేడీ చేరిన విషయం తెలిసిందే. ఆమె ఆదివారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిశారు.












Click it and Unblock the Notifications