వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: కాలుష్యంతో సెక్స్ సామర్థ్యాన్ని కోల్పోతున్న ఢిల్లీ పురుషులు

సర్వేలో ఢిల్లీ పురుషులను దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి. కాలుష్యం కారణంగా.. అక్కడి మగవారిలో జుట్టు రాలిపోవడంతో పాటు వీర్యహీనత, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టుగా సర్వ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. ఆరోగ్యంపై తీవ్ర దుష్పలితాలను చూపిస్తున్న కాలుష్యం వల్ల అక్కడి పురుషుల్లో వీర్య హీనత ఏర్పడుతున్నట్టుగా తాజాగా ఓ సర్వే వెల్లడించింది. వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రస్తుతం ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

వాయు కాలుష్యానికి తోడు ధ్వని కాలుష్యం కూడా ఢిల్లీ ప్రజలను ఇబ్బందిపెడుతోంది. శ్వాసకోశ మరియు కళ్ల మంటలు, గుండె జబ్బులు వంటి వ్యాధులతో ప్రస్తుతం ఢిల్లీ జనం తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యంపై దాల్మియా మెడికేర్ అనే ఓ సంస్థ సర్వే నిర్వహించింది.

Delhi

సర్వేలో ఢిల్లీ పురుషులను దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి. కాలుష్యం కారణంగా.. అక్కడి మగవారిలో జుట్టు రాలిపోవడంతో పాటు వీర్యహీనత, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టుగా సర్వే వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో అక్కడి మగవారిలో వీర్య హీనత సమస్య 14శాతం ఉండగా, నవంబర్ నాటికి అది 27శాతానికి పెరిగినట్టుగా సర్వే తెలిపింది.

జాతీయ సగటు ప్రకారం స్పెర్మ్ కౌంట్ 20మిలియన్లు/మి.లీ గా నిర్ణయించగా.. ఢిల్లీలోని 63శాతం పురుషుల్లో అది 10మిలియన్ల కన్నా తక్కువగా ఉండటం గమనార్హం. 60శాతం మంది పురుషుల్లో టెస్టోస్టీరాన్ హార్మోన్ శాతం కూడా అతి తక్కువ స్థాయిలో ఉందంటూ సర్వే వెల్లడించింది.

300-350 నానోగ్రామ్స్/డెసిలీటర్ కన్నా తక్కువ స్థాయిలో టెస్టోస్టీరాన్ కలిగివున్న పురుషులు 60శాతం ఉన్నట్టు సర్వే ద్వారా తేలింది. కాగా, పురుషుడిలో సగటున ఉండాల్సిన టెస్టోస్టీరాన్ సగటు 300-1200నానోగ్రామ్స్/డెసిలీటర్. కాలుష్యంతో పాటు పనిఒత్తిడి, స్మోకింగ్ కూడా దీనికి కారణాలుగా సర్వే ద్వారా వెల్లడైంది.

English summary
Of the host of unpleasant news we were subjected to in 2016, Delhi's worsening air pollution was among those which worried us the most. At one point this year, the condition declined to a level where a health emergency was declared in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X