‘ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఉగ్రవాదికి మద్దతుగా నినాదాలు’

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు వినిపించాయి. అది కూడా ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో. పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా నినాదాలు వినిపించడంతో ప్రెస్ క్లబ్ అధికారులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు.

కాశ్మీర్‌పై చర్చించేందుకు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ జాఫర్ ప్రెస్‌క్లబ్ కార్యాలయంలోని హాల్‌ను బుధవారం బుక్ చేసుకున్నారు. అయితే అలీ జాఫర్ బృందంలోని కొందరు ‘కాశ్మీర్ లేకర్ రెహెనేజ్', ‘అఫ్జల్ గురు అమర్ రహే' అంటూ దేశ వ్యతిరేక, ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారు.

Delhi Shocker: 'Afzal Guru Amar Rahe', anti-India slogans rocked Press Club

అంతేగాక, అఫ్జల్ గురు చిత్రాలను కూడా అక్కడ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు పిసిఐ షోకాజు నోటీసులు పంపింది. అయితే, తన బృందంలోని కొందరు ఇలా నిరసనలు వ్యక్తం చేస్తారని తనకు తెలియని చెప్పారు ప్రొఫెసర్.

‘నా దృష్టికి వచ్చిన వెంటనే నినాదాలు చేయొద్దని వారించా. కానీ, వారు వినలేదు' అని మీడియాతో జాఫర్ చెప్పడం గమనార్హం. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిపిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+