సుష్మా కూతురుకు గుండెపోటు: ఎయిమ్స్‌లో చేరిక
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి కౌషల్‌కు స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆమెను ఎయిమ్స్‌లో చేర్చారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
31ఏళ్ల బన్సూరి బన్సూరి ప్రస్తుతం ఆస్పత్రి కార్డియో న్యూరో, న్యూరాలజీ విభాగం వైద్యుడు ఎంవి పద్మ శ్రీవాత్సవ పర్యవేక్షణలో ఉన్నారు. స్వల్ప గుండె పోటు రావడంతో ఆమె ఆస్పత్రిలో చేరారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

‘ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలోనే ఆమె ఉన్నారు' అని ఆయన చెప్పారు. కాగా, లలిత్ మోడీకి ట్రావెల్ డాక్యుమెంట్లు జారీ చేయడంలో సుష్మా సహకరించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బన్సూరి వార్తల్లోకి ఎక్కారు.
2012-14 మధ్య కాలంలో లలిత్ మోడీ తరపున న్యాయ సంబంధమైన వ్యవహారాలను న్యాయవాది అయిన బన్సూరి చూసేవారు. దీంతో ఆమెపైన ఆరోపణలు వచ్చాయి. ఐపిఎల్ అవినీతికి పాల్పడినట్లు లలిత్ మోడీపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications