ఢిల్లీలో దారుణం.. కారుతో క్యాబ్ డ్రైవర్ ను ఈడ్చుకెళ్లారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కారును దొంగలించిన కొందరు దుండగులు తప్పించుకునే ప్రయత్నంలో ఆ క్యాబ్ డ్రైవర్‌ను ఢీకొట్టి చాలా దూరం ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ(Delhi)లోని వసంత్ కుంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్ర అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన కారులో వెళుతుండగా.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అతడిపై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు.

అ తర్వాత అతడ్ని బయటకు లాగి కారుతో సహా పారిపోయేందుకు యత్నించారు. వారిని అడ్డగించాలని చూసిన డ్రైవర్‌ను కారుతో ఢీకొట్టారు. ఈ క్రమంలోనే బాధితుడు కారు కిందపడిపోయాడు. అయినప్పటికీ కారు వేగాన్ని పెంచి బిజేంద్రను దాదాపు 200 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లారు. కారు అతని తలపైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో బిజేంద్ర తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటననంతా వెనకవచ్చే వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
This is brutal!
— Jitender Sharma (@capt_ivane) October 11, 2023
दिल्ली के महिपालपुर इलाके में कार लूट कर चालक की सड़क पर घसीट कर हत्या की। #DelhiCrime pic.twitter.com/nZHZnEbyyy
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలు ఏర్పాటు చేశారు. కాగా, కొన్ని నెలల క్రితం ఢిల్లీలో అంజలి అనే యువతిని కూడా కొందరు దుండగులు కారుతో ఢీకొట్టి కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలోనూ బాధితురాలు మృతి చెందింది. ఈ ఘటన మరువకముందే మరో ఘటన జరగడం గమనార్హం. నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications