వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: కారు బానెట్‌పై ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లాడు, 2 కి.మీల వరకు..(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Delhi Cop Bravery, Video Goes Viral | పొగరెక్కిన కారు డ్రైవర్ ని రఫ్ఫాడించిన ట్రాఫిక్ పోలీస్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళుతున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, అతడు ఆపినా ఆగకుండా అతని మీదకు పోనిచ్చాడు కారులోని వ్యక్తి. దీంతో ఆ పోలీసు కారు బానెట్ పట్టుకుని వేలాడారు.

కారును ఆపిన పోలీసు అధికారి..

కారును ఆపిన పోలీసు అధికారి..

గత నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఘటనపై సమద్రంగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నంగ్లోయి చౌక్‌లో వాహనాలకు సంబంధించిన పేపర్లను తనిఖీ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఓ కారులో వచ్చిన వ్యక్తి మరో మార్గం గుండా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఓ పోలీసు అధికారి ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

కారుపై బానెట్‌పైకి పోలీసు ఎక్కడంతో..

కారుపై బానెట్‌పైకి పోలీసు ఎక్కడంతో..

కారును ఆపినట్లే ఆపి.. వెంటనే మళ్లీ వేగంగా తీసుకెళ్లాడు. దీంతో సదరు పోలీసు అధికారి కారు బానెట్‌పై పడ్డాడు. బానెట్ పట్టుకుని వేలాఢాడు. అయినా ఆపకుండా సదరు కారు యజమాని.. రెండు కిలోమీటర్ల వరకు అలాగే కారును పోనిచ్చాడు. ఆపమని సదరు పోలీసు అధికారి ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

రెండు కిలోమీటర్ల వరకు..


చివరకు రెండు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కారును ఆపడంతో సదరు పోలీసు అధికారు కారు దిగాడు. వెంటనే కారులోని వ్యక్తి కారుతో అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో సునీల్ అనే పోలీసు అధికారికి గాయాలయ్యాయి. కాగా, ఉదంతాన్నంత కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. కారును ఫాలో అయినవారు కూడా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైలర్ అయ్యాయి.

English summary
To catch a man from trying to escape the traffic police at a security check in Delhi, an official jumped atop his car's bonnet but was dragged by the accused for almost two kilometers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X