వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కలకలం- టూ వీలర్ల నంబర్ ప్లేట్లపై సెక్స్ -అదేంటో తెలిస్తే షాక్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో వాహనదారులకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. ముఖ్యంగా మహిళలకు ఇది మరింత ఎక్కువగా ఉంది. తాజాగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లపై సెక్స్ అనే పదం కనిపిస్తోంది. దీంతో వాహనాలు నడిపేవారు, కొనుగోలు చేసే వారు, రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఇంతకీ ఈ సెక్స్ అనే పదం వాహనాల నంబర్ ప్టేట్లపైకి ఎందుకు వచ్చిందని ఆరా తీస్తే అసలు విషయం అర్దమైంది. ఢిల్లీలో స్ధానికంగా ఇచ్చే వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ ప్రకారం ఈ సెక్స్ అనే పదం వాహనాల నంబర్ ప్లేట్లపై కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ విషయం తెలియక ఆరంభంలో అవాక్కయిన కస్టమర్లు, వాహనదారులు ఇప్పుడు క్రమంగా అలవాటు పడుతున్నారు. ఇంకా కొందరు అలవాటు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళా వాహన దారులైతే మరీ దారుణం. వాహనంపై ఈ సెక్స్ పదాన్ని ప్రదర్శిస్తూ వాహనాలు నడిపేందుకు జంకుతున్నారు. అసలే నిర్బయ ఘటనలు జరిగిన ఊరు కావడంతో అక్కడ మహిళలకు ఈ ద్విచక్ర వాహనాలు నడపడం కష్టమవుతోంది.

delhi two wheeler drivers face SEX problem on number plates

వాస్తవానికి ద్విచక్ర వాహనాలను ఢిల్లీలో 'S' అక్షరంతో సూచిస్తారు. ఢిల్లీ నంబర్ ప్లేట్‌ల తయారీలో ఓ విధానం ఉంటుంది. ఢిల్లీ నగరాన్ని తెలిపేందుకు DL, తర్వాత జిల్లాను సూచించే సంఖ్య, వాహనం రకం కోసం ఒక అక్షరం, దాని తర్వాత తాజా సిరీస్‌ని సూచించే 2 అక్షరాలు ఉంటాయి. ఆ సిరీస్‌లో 4 అంకెల విశిష్ట సంఖ్య. దీని ప్రకారం ఓ సాధారణ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఇలా ఉంటుంది: DL 2 C AD 1234. ఢిల్లీకి DL, ఈస్ట్ డిస్ట్రిక్ట్‌కి 2, C ఫర్ కార్ లేదా టూ వీలర్స్ కోసం S, నంబర్ సిరీస్ కోసం AD తర్వాత నంబర్. దీంతో తాజాగా ఢిల్లీలో ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్‌లపై 'S' అక్షరం తర్వాత 'EX' అక్షరం వస్తోంది. దీంతో వాహనాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

English summary
delhi two wheeler drivers now facing SEX problem on vehicle number plates as govt issued the series with these letters in serial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X