ఫ్లిప్ కార్ట్‌కు కన్నం వేశారు: రూ. 37 లక్షలు లూటీ, ఉదయం వచ్చి చూస్తే!
ఫ్లిప్ కాట్ సంస్థకు చెందిన కార్యాలయంలో చొరబడిన దుండగులు రూ. 37 లక్షలు లూటీ చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. దుండగులు ముసుగులు వేసుకుని వచ్చి నగదు లూటీ చేశారని సోమవారం ఢిల్లీ నగర పోలీసులు చెప్పారు.
న్యూఢిల్లీ: ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్యాలయంలో చొరబడిన దుండగులు రూ. 37 లక్షలు లూటీ చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. దుండగులు ముసుగులు వేసుకుని వచ్చి నగదు లూటీ చేశారని సోమవారం ఢిల్లీ నగర పోలీసులు చెప్పారు.
ఢిల్లీలోని జల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లిప్ కార్ట్ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి ఫ్లిప్ కార్ట్ తన ఖాతాదారులకు కావలసిన వస్తువులు సరఫరా చేస్తుంటారు. ఆదివారం అర్దరాత్రి ముగ్గురు దుండగులు ముసుగులు వేసుకుని కార్యాలయంలో చొరబడ్డారు.

తరువాత లాకర్లు పగలగొట్టిన దుండుగులు నగదు, డిజిటల్ వీడియో రికార్డర్లు లూటీ చేసి పరారైనారు. సోమవారం కార్యాలయంలోకి వచ్చిన సిబ్బంది చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లిప్ కార్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications