మరో గంటలో పరీక్ష: వాట్సప్‌లో ప్రశ్నాపత్రం లీక్ చేశారు
న్యూఢిల్లీ: మరో గంటలో పరీక్ష ప్రారంభం కానుండగా ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం 3గంటలకు బి.కామ్ చివరి సంవత్సర పరీక్ష జరగాల్సి ఉంది.
కాగా, సరిగ్గా పరీక్ష మరో గంటలో ప్రారంభమవుతుందనగా.. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్రాపత్రాన్ని పరిశీలించగా.. రెండు ప్రశ్నాపత్రాలు ఒకేలా ఉన్నాయి.

అయితే స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఛైర్మన్ దూబే మాత్రం ప్రశ్నాపత్రం లీకైందన్న వార్తలను తోసిపుచ్చారు. ఇది ఎవరో చేసిన తుంటరి పని అని కొట్టిపారేశారు.
లీకేజీ గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కళాశాలకు చెందిన ఇతర అధికారులు కూడా ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications