కూతురు కిడ్నాప్ యత్నం, సింగంలా దుండగుల నుంచి లాక్కుని కాపాడుకున్న తల్లి(వీడియో)

న్యూఢిల్లీ: తల్లి ప్రేమ ముందు ఏ దుష్టశక్తి కూడా పనిచేయదని ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తన కూతురును అపహరించేందుకు ప్రయత్నించిన దుండగుల బారి నుంచి ఆదిశక్తిలా మారిన తల్లి.. వారిని తరిమికొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Recommended Video

    #WATCH : తల్లి ప్రేమ.. దుండగుల నుండి ఒంటి చేత్తో బిడ్డను కాపాడుకున్న తల్లి! || Oneindia Telugu

    మంగళవారం సాయంత్రం బైక్‌పై శకర్పూరు ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఓ తల్లి నుంచి తన నాలుగేళ్ల కూతురును లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన తల్లి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. చిన్నారిని వారి నుంచి తిరిగి లాగేసుకుంది.

    తల్లి ప్రతిఘటనకు షాకైన దుండగులు అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాన్ని చూసిన ఓ స్థానికుడు రోడ్డుపై తన స్కూటర్ అడ్డుపెట్టి ద్విచక్ర వాహనంపై పారిపోతున్న దుండగులను అడ్డుకున్నాడు. కిందకు తోసేసి వారిని పట్టుునే ప్రయత్నం చేశాడు.

    అయితే, ఎలాగోలా దుండగులు తప్పించుకుని అక్కడ్నుంచి పరారయ్యారు. కాగా, ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక దుండగులు వదిలేసిన బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

    Delhi Woman Fights Off Kidnappers To Save 4-Year-Old Daughter

    కాగా, ఆ చిన్నారి కిడ్నాప్‌నకు ఆమె అంకుల్ ఉపేంద్ర(బిట్టు)నే సూత్రధారి కావడం గమనార్హం. పాపను కిడ్నాప్ చేస్తే రూ. 1 లక్ష ఇస్తామని చెప్పాడని నిందితులు పోలీసులు చెప్పారు. కాగా, నిందితుల నుంచి ఓ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+