మహిళ అర్థనగ్న నిరసన: పాతనోట్ల మార్పిడికి 'నో' చెప్పడంతో

భధ్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు నెట్టడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆర్బీఐ గేటు ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: పాత నోట్లు మార్చుకోవడం కోసం ఆర్బీఐ వద్దకు వెళ్లిన ఓ వివాహిత పట్ల అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆర్బీఐ ఎదుట అర్థనగ్నంగా ప్రదర్శన చేసింది. న్యూఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి పాతనోట్లు మార్చుకోవడానికి ఆర్బీఐ కార్యాలయం వద్దకు వచ్చింది. అయితే పాతనోట్ల మార్పిడికి అధికారులు 'నో' చెప్పారు. సిబ్బంది కాళ్లా వేళ్లా పడి బ్రతిమాలుకున్నా లోపలికి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది.

delhi woman getting half naked infront of RBI

అంతేకాదు, భధ్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు గెంటివేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆర్బీఐ గేటు ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్బీఐ వద్దకు చేరుకుని కుమార్తెతో సహా ఆమెను స్టేషన్ కు తరలించారు.

ఇదంతా చూసిన స్థానికులు.. ప్రధాని ముందు ప్రకటించినట్టుగా మార్చి 31 వరకు పాతనోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వాలని, ఆ మాటకు మోడీ కట్టుబడి ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+