రియల్ స్టోరీ: 'ఆడపిల్ల పుడితే ఫీజు తీసుకోను'

పూణె: దేశంలో లింగవివక్షను రూపుమాపేందుకు తన వంతు ప్రయత్నంగా ముందుకు కదిలాడు పూణెలోని ఓ డాక్టర్. తనకు చేతనైనంత మంచి పనులు చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆ డాక్టర్ పేరు గణేశ్ రాఖ్.

మహారాష్ట్రలోని పుణేలో హదాప్సర్ ప్రాంతంలో ఆయనకు జనరల్ & మెటర్నిటీ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో కాన్పు చేసుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే ఆయన ఫీజు తీసుకోరు. అయితే సాధారణ ప్రసవానికి రూ. 10 వేలు, సిజేరియన్‌కు రూ. 25 వేలు తీసుకుంటారు.

కాన్పు సమయంలో ఆడపిల్ల పుట్టిన దంపతుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తున్నారు. 2012లో ప్రారంభమై, ఇప్పటి వరకు 432 మంది మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. అంతేకాదు ఆడపిల్ల పుడితే ఆసుపత్రి సిబ్బంది స్వీట్లు పంచుతారు.

Delivered a Baby Girl? This Doctor Will Waive Off the Delivery Charges

అంతేకాదు లింగవివక్షను రూపు మాపేందుకు పూణె చుట్టుపక్కల ఉన్న సుమారు 18 పంచాయితీల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 మంది డాక్టర్లు, గణేశ్ రాఖ్ విధానాన్నే అవలంభిస్తున్నారు. ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో గణేశ్ రాఖ్ ప్రసవ సమయంలో పుట్టేది బాబా, పాపా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు.

అబ్బాయి పుడితే ఆనందపడతారు, అదే అమ్మాయి పుడితే బాధపడతారన్నారు. అంతేకాదు అబ్బాయి పుడితే ప్రసవ వేదనను కూడా మర్చిపోయి మురిసిపోతుంటారు. ఆడపిల్ల పుడితే కన్నీరుమున్నీరవుతుంటారన్నారు. రాష్ట్రంలో లింగవివక్షను రూపుమాపాలనే ఉద్దేశ్యంతో నా వంతు ప్రయత్నంగా 2007 నుంచి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నానన్నారు.

ఆడపిల్లల పట్ల ప్రజల ఆలోచనా విధానం మారాలన్నారు. ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+