వ్యాక్సిన్ కంపల్సరీ.. లేదంటే రూ.15 వేల ఫైన్.. ఎక్కడ అంటే
కరోనాకు వ్యాక్సినే శ్రీ రామ రక్ష.. అందుకే అందరూ కంపల్సరీ వేసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగస్తులకు వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాయి. దేశంలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానం వల్ల వైరస్ ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేదని అంతా భావించారు. కానీ పరిస్థితి మారింది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్నా..
ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న అనేక మంది వైరస్ భారిన పడ్డారు. వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోల్చితే వేయించుకున్న వారిలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. వ్యాక్సిన్ వేయించుకోవడం స్వచ్ఛందమేనని ప్రభుత్వాలు చెబుతున్నా.. అందరూ తప్పనిసరిగా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్లల్లో, విమానాల్లో, ఆలయాలలో ఇలా అనేక చోట్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారికే అనుమతి ఇస్తున్నారు.

కంపల్సరీ
అనేక సంస్థలు సైతం తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే విధుల్లోకి అనుమతించమని స్పష్టం చేస్తుండటంతో చాలా మంది వ్యాక్సి్‌న్ వేయించుకుంటున్నారు. ఇక తాజాగా ప్రముఖ డెల్టా ఎయిర్ లైన్స్ ఇలాంటి ఓ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులను తప్పనిసరిగా తీసుకోవాలని తన ఉద్యోగులకు సూచించింది. ఒక వేళ ఎవరైనా ఉద్యోగులు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోకపోతే నెలకు వేతనంలో నుంచి రూ.15,000 వసూలు చేస్తామని తెలిపింది డెల్టా ఎయిర్ లైన్స్.

జాబ్ కూడా..
సెప్టెంబర్ 30 తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోకుండా ఎవరైనా ఉద్యోగి కనిపిస్తే, అతని జీతం నిలిపివేయబడుతుందని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగులంతా తప్పకుండా మాస్కు ధరించాలని తెలిపింది. అలాగే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సైతం తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులంతా సెప్టెంబర్ 27 లోపు టీకాలు వేయించుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 27 తర్వాత వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే ఉద్యోగాలను కూడా తొలగిస్తామని స్పష్టం చేసింది. దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది.

. కరోనా ఇంపాక్ట్
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video

ఫంగస్ బెడద
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications