ఆ 11వ నంబర్ సీటు లేదా ? ఫ్లైట్ క్రాష్ తర్వాత భారీ డిమాండ్..? అంత సేఫా ?

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో తాజాగా ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదానికి గురై ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది సహా మొత్తం 241 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఓ సీట్లో కూర్చొన్న ప్రయాణికుడు మాత్రం సురక్షితంగా ఇంత పెద్ద ప్రమాదం నుంచి బతికిపోయాడు. దీంతో ఆ మృత్యుంజయుడితో పాటు అతను కూర్చొన్న సీటుపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సీటులో కూర్చొంటే ప్రమాదం జరిగినా ఏమీ కాదా అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగినప్పుడు బ్రిటిష్ ఇండియన్ విశ్వాష్ కుమార్ రాజేష్ ఎకానమీ క్లాస్ లో ఉన్న మొదటి వరుసలో ఉన్న 11ఏ సీటులో కూర్చొన్నారు. విమానం ఒక్కసారిగా ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి కిందకు దిగిపోయిన తర్వాత పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ లోకి దూసుకెళ్లింది. అప్పుడు విమానం రెండు భాగాలుగా విడిపోయింది. ఆ తర్వాత ఓ భాగం పేలిపోయింది. మరో భాగంలో ఉండిపోయిన రాజేష్ మాత్రం బతికిపోయాడు. అతను సురక్షితంగా విమాన శకలాల నుచి బయటికి రావడం చూసి అంతా షాకయ్యారు. అతను మాత్రం తాను ఎలా బతికిపోయానో తెలియదని చెప్పుకొచ్చాడు.

demand for 11a seat in planes after Ahmedabad air india flight crash-here is why

దీంతో ఇప్పుడు ఈ మృత్యుంజయుడు ప్రయాణించిన 11ఏ నంబర్ సీట్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంత లక్కీ సీటును వదులుకోవడం ఎందుకని కొందరు ఇతర విమానాల్లో సైతం దీన్నే బుక్ చేసుకుంటుండగా.. మరికొందరు ఈ సీటులో కూర్చొంటే ప్రమాదం జరిగినా తప్పించుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 11 సీటుకు బుకింగ్స్ పెరుగుతున్నట్లు విమానయాన సంస్థల వర్గాలు చెప్తున్నాయి. అయితే 11ఏ సీటులో కూర్చొంటే ఏమీ కాదా అన్న చర్చకు నిపుణులు సమాధానం ఇస్తున్నారు.

రమేష్ బతికి బయటపడటం ఒక అద్భుతమే అయినా ఎమర్జెన్సీ ద్వారం దగ్గరే ఈ 11ఏ సీటు ఉండటం వల్ల అది సురక్షితమైనా సీటా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన అంగద్ సింగ్ అనే విమానయాన నిపుణుడు ఎన్టీటీవీతో మాట్లాడుతూ.. విమానంలో సురక్షితమైన సీట్లు ఉంటాయని, చాలా సంవత్సరాలుగా జరిగిన విమాన ప్రమాదాల గణాంకాలు మధ్యలో ఉన్న సీట్ల కంటే చాలా చివరన లేదా కుడివైపు ముందు భాగంలో ఉన్న సీట్లు సురక్షితమైనవని చూపిస్తున్నాయని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మాత్రం అది వర్తించదన్నారు. ఎందుకంటే ఈ 11ఏ సీటు మధ్యలోనే ఉందని, కాబట్టి ఇది అద్భుతమే అని చెప్పొచ్చన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+