వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైడ్రాక్సిక్లోరిన్‌కు పెరుగుతున్న డిమాండ్: 6 రెట్లు ఉత్పత్తిని పెంచిన ఔషధ కంపెనీలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తున్న వేళ దీనికి విరుగుడుగా మలేరియాకు ఇచ్చే హైడ్రాక్సిక్లోరోక్విన్ అని వైద్యులు సూచించడంతో దీనికి డిమాండ్ ఏర్పడింది. ముందుగా ఈ డ్రగ్‌ ఎగుమతిపై భారత్ నిషేధం విధించగా ఆ తర్వాత మెత్తబడ్డ భారత్ ఇతర దేశాలకు దిగుమతి చేసేందుకు అంగీకరించింది. ముందుగా అమెరికా, బ్రెజిల్ దేశాలతో పాటు ఇతర దేశాలకు కూడా సప్లయ్ చేస్తామని భారత్ పేర్కొంది.

ఆరు రెట్లు ఉత్పత్తిని పెంచిన కంపెనీలు

ఇక ఈ డ్రగ్ తయారీకి భారత ఫార్మాసూటికల్స్ కంపెనీలు సాధారణ సమయాల్లో కాకుండా ఈ సమయంలో 4 రెట్లు అధికంగా తయారు చేయాలని నిర్ణయించాయి . ఈ నెలాఖరు కల్లా 40 మెట్రిక్ టన్నుల మేరా హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను తయారు చేయాలని భావిస్తున్నాయి. వచ్చే నెలకల్లా ఈ ఉత్పత్తిని పెంచి 70 మెట్రిక్ టన్నులకు తీసుకురావాలని ఫార్మా కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతి నెలా 200 ఎంజీ డోస్‌తో ఉన్న టాబ్లెట్లను 35 కోట్లు తయారు చేస్తున్నాయి. ఇక భారత్‌లో మన అవసరాలకు సాధారణం కంటే అధికంగా 10 కోట్ల టాబ్లెట్లు అవసరం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జైడస్ క్యాడిలా, ఇప్కా లాబొరేటరీలకు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో మాత్ర రూ. 3 ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏడు కోట్ల మందికి చికిత్స అందించేందుకు 10 కోట్లు మాత్రలు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్‌ అవసరాలు తీరాకా మిగిలిన టాబ్లెట్లను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చనే అభిప్రాయంతో సంస్థలు ఉన్నాయి.

తయారు చేస్తున్న కంపెనీలు ఇవే

ఇక హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలను తయారు చేస్తున్న ఇతర కంపెనీల్లో ఇంటాస్ ఫార్మషూటికల్స్, మెక్‌డబ్ల్యూ హెల్త్ కేర్ ఆఫ్ ఇండోర్, మాక్లియాడ్స్, సిప్లా, లూపిన్ సంస్థలు ఉ్ననాయి. ఇక ఈ మెడిసిన్‌ను తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలను అబాట్ ఇండియా, రుసాన్ ఫార్మా, మంగళం డ్రగ్స్, యూనికెమ్ రెమిడీస్, లారస్ ల్యాబ్స్ విజయశ్రీ ఆర్గానిక్స్ సప్లయ్ చేస్తున్నాయి. ఇక హైడ్రాక్సి క్లోరోక్విన్ తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలను ఈ సంస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో దక్షిణ కొరియా ఇటలీ లేదా ఫిన్‌లాండ్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాయి.కరోనావైరస్‌ నివారణలో హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్‌ పనిచేస్తుందని పలు స్టడీలు చెప్పడంతో చాలా జాగ్రత్తతతో వ్యవహరిస్తున్నామని ఆయా సంస్థలు చెబుతున్నాయి.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby
అమెరికాలో హైడ్రాక్సిక్లోరోక్విన్‌కు భారీ డిమాండ్

అమెరికాలో హైడ్రాక్సిక్లోరోక్విన్‌కు భారీ డిమాండ్

ఇక చైనాలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి ముడిసరుకు రావడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదని ఇండియన్ డ్రగ్ మానుఫాక్చురర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే 20 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పిన తయారీదారులు అంతా కలిసే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ డ్రగ్ కావాల్సిన ప్రతి ఒక్క పేషెంటుకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఔషధ తయారీ కంపెనీలు చెప్పాయి. 2018-19లో హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను ఎగుమతి చేసిన దేశాల్లో భారత్‌ది సింహభాగమని చెప్పొచ్చు. ఈ డ్రగ్‌కు అమెరికా మార్కెట్‌లో 220 మిలియన్ డాలర్లు ఉండగా భారత్ 51 మిలియన్ డాలర్ల మేరా ఉత్పత్తి చేసి అమెరికాకు ఎగుమతి చేసిందని సమాచారం. జైడస్ క్యాడిలాకు అమెరికా మార్కెట్లో 32శాతం ఉండగా 10శాతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 7శాతం సన్ ఫార్మాలు హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎగుమతి చేస్తున్న కంపెనీలుగా ఉన్నాయి.

English summary
Indian pharmaceutical companies are raising monthly production of anti-malarial drug Hydroxychloroquine (HCQ) four times to 40 metric tonnes (MT) by the end of this month and five to six times to over 70 metric tonnes (MT) by next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X