కొత్త పార్టీని ప్రకటించిన గులాం నబీ ఆజాద్: 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ', జెండా ఇదే

న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం జమ్మూలో తన కొత్త పార్టీని ప్రారంభించారు. 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ'గా తన పార్టీ పేరును ప్రకటించారు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.

"నా కొత్త పార్టీ కోసం దాదాపు 1,500 మంది పేర్లను ఉర్దూ, సంస్కృతంలో మాకు పంపారు. హిందీ, ఉర్దూల మిశ్రమం 'హిందుస్తానీ'. పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అని జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు.

Democratic Azad Party: Ghulam Nabi Azad Announces His New Political Party In Jammu

ఈ సందర్బంగా పార్టీ జెండాను కూడా ఆజాద్ ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించిన ఆజాద్ మాట్లాడుతూ.. ఆవాల రంగు సృజనాత్మకతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని, తెలుపు శాంతిని, నీలం స్వేచ్ఛను, ఖాళీ స్థలాన్ని, ఊహలను, సముద్రపు లోతుల నుంచి ఆకాశం ఎత్తు వరకు ఉన్న పరిమితులను సూచిస్తుంది అని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, దాని నివాసితుల భూమి, ఉద్యోగ హక్కులను పరిరక్షించడం తన పార్టీ ప్రధాన అజెండా అని గులాం నబీ ఆజాద్ ఇంతకుముందే పేర్కొన్నారు.

73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన సందర్బంగా పార్టీ "సమగ్రంగా నాశనం చేయబడింది' అని పేర్కొన్నారు. పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని మొత్తం కూల్చివేసిందని రాహుల్ గాంధీపై ఆయన మండిపడ్డారు.

ఆజాద్‌కు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌తో సహా రెండు డజన్ల మంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

ఇద్దరు మాజీ శాసనసభ్యులు, పీడీపీ, అప్నీ పార్టీకి చెందిన ఒక్కొక్కరు కూడా వారిని అనుసరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+