కొత్త నోట్ల కోసం ఓపిక నశించి.. టాప్‌లెస్‌గా 'క్యూ'లో నిలుచుంది..
న్యూఢిల్లీ : దేశంలో నోట్ల రద్దు సామాన్య జనం సహనాన్ని పరీక్షించేదిగా మారింది. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంలు చుట్టు ప్రదక్షిణలు చేసినా.. నోట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో.. తీవ్ర అసహనంలో ఉన్నారు చాలామంది సామాన్య జనం. విపరీతమైన ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేస్-3 ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎం వద్ద గంటల తరబడి క్యూ లో వేచియున్న ఓ యువతి.. ఓపిక నశించి ఎవరూ ఊహించని చర్యకు పాల్పడింది. ఏకంగా తన టాప్ ను పూర్తిగా తొలగించేసి క్యూలో అలాగే నిలబడిపోయింది. టాప్ లెస్ గా యువతి క్యూ లో నిలుచుండడంతో జనమంతా ఆమె వైపే చూపు తిప్పుకున్నారు.

యువతి చర్యను పక్కనున్న మహిళలు వారించినా.. ఆమె మాత్రం వారి మాట వినే ప్రయత్నం చేయలేదు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎం నుంచి పోలీసులే డబ్బులు డ్రా చేసి ఇచ్చి.. ఆమెను పంపించేశారు. మొత్తానికి నోట్ల రద్దు ఫ్రస్టేషన్.. సామాన్యులను చిత్ర విచిత్రంగా ప్రవర్తించేలా చేస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications