ఆర్బీఐ నుంచి రెండు శుభవార్తలు! నగదు విత్ డ్రా పరిమితి పెంపు, మార్చిలో ఎత్తివేత
నగదు విత్ డ్రా పరిమితిపై ఆంక్షలను సడలించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) తాజాగా ప్రకటించింది. రెండు దశల్లో విత్ డ్రా పరిమితిని సడలిస్తున్నట్లు పేర్కొంది.
యూఢిల్లీ: నగదు విత్ డ్రా పరిమితిపై ఆంక్షలను సడలించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) తాజాగా ప్రకటించింది. రెండు దశల్లో విత్ డ్రా పరిమితిని సడలిస్తున్నట్లు పేర్కొంది.
సేవింగ్స్ ఖాతాదారులు ఫిబ్రవరి 20 నుంచి వారానికి రూ.50 వేల వరకు డ్రా చేసుకోవచ్చని, అలాగే మార్చి 13 నుంచి నగదు విత్ డ్రా పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం వారానికి రూ.24 వేల వరకే డ్రా చేసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటుగా సైబర్ సెక్యూరిటీపై ఆర్బీఐ కమిటీ వేసింది. సైబర్ సెక్యూరిటీకి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ ఆర్బీఐకి నివేదిస్తుంది.
ఆర్బీఐ తాజాగా ప్రకటించిన ఈ చర్యలతో.. నోట్ల రద్దు తరువాత నగదు విత్ డ్రా పై విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోతుంది. అంటే.. రోజువారీ, వీక్లీ విత్ డ్రాలపై ఉన్న పరిమితులు ఎత్తివేసినట్లే. ఆ తరువాత ఎవరు ఎంత నగదైనా విత్ డ్రా చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications