నోట్ల రద్దును సిఫార్సు చేసింది ఆర్బీఐనే : అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దు చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సిఫార్సు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దు చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సిఫార్సు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన దీనిపై వివరణ ఇచ్చారు.

2016 నవంబర్ 8న ఆర్బీఐ ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలన్న ప్రతిపాదనపై సమగ్ర చర్చ నిర్వహించారని, చలామణీలో ఉన్న అన్ని పాత సిరీస్ నోట్లను రద్దు చేయాలని ఆర్బీఐ సిఫార్సు చేసిందని వివరించారు. ఈ సమావేశానికి 10 మంది స్వతంత్ర డైరెక్టర్లలో 8 మంది హాజరయ్యారని అరుణ్ జైట్లీ చెప్పారు.

పెద్దనోట్లు రద్దు చేసే సమయంలో ఆర్బీఐ నుంచి ఏమైనా సిఫార్సులు అందాయా? లేక ప్రభుత్వాన్నే ఆర్బీఐ సిఫార్సులు అడిగిందా? అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ అడిగిన ప్రశ్నకు జైట్లీ పై విధంగా సమాధానమిచ్చారు.

Demonetization is based on RBI's Recommendation only, Says Arun Jaitley in Rajya Sabha

ఆర్బీఐనే తనకు తానుగా స్వతంత్రంగా రూ.500, రూ.1000 నోట్ల రద్దుకు సిఫార్సు చేసిందని చెప్పారు. అంతకుముందు పెద్దనోట్ల రద్దు అంశంపై జైట్లీ మాట్లాడుతూ.. 2016 ఫిబ్రవరిలోనే ఇందుకు పునాదులు పడ్డాయని, మేలో చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్ల డిజైన్ తదితర విషయాలకు ఆర్బీఐ ఆమోద ముద్ర వేసిందని, ఆ తరువాతే వరుసగా రహస్య సమావేశాలు జరిగాయని, ఇందుకు సంబంధించిన అధికారిక తీర్మానాన్ని ఆర్బీఐ కేంద్ర బోర్డు నవంబర్ 8న అమోదించిందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+