వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసభ్య ఎంఎంఎస్ తీశాడని తండ్రిపై కూతురు ఫిర్యాదు!

|
Google Oneindia TeluguNews

Denied car by father, woman accuses him of making her obscene MMS clip
బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలిలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. తన కన్న తండ్రే తన అసభ్యకరమైన ఎంఎంఎస్ క్లిప్ తీశాడని, దాన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఓ కూతురు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులకు ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు బయటపడ్డాయి.

తనకు, తన భర్తకు కారు కొని ఇవ్వలేదని కోపంతోనే తన తండ్రిపై ఆ కూతురు ఫిర్యాదు చేసిందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. కారు కొనివ్వని కారణంగానే తండ్రిని ఈ విధంగా బ్లాక్‌మెయిల్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఆ కూతురు తన తండ్రితోపాటు మరో ఇద్దర్ని కూడా తన ఫిర్యాదులో చేర్చింది.

ఫిర్యాదుదారు తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన కథనం ప్రకారం.. తన కూతురు(ఫిర్యాదుదారు)కు, ఆమె ఇష్టపడిన యువకుడికి వివాహం నిశ్చయించారు. అయితే పాత గొడవల కారణంగా ఆ వివాహ ప్రతిపాదన మధ్యలోనే ఆగిపోయింది. కాగా, వివాహం ఆగిపోవడంతో ఆ యువకుడితో తన కూతురు వెళ్లిపోయింది.

ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ ఇద్దరూ వివాహం చేసుకుని తిరిగి వచ్చారు. అప్పట్నుంచి తన తండ్రిని కారు కొనివ్వాలని బ్లాక్‌మెయిలింగ్ చేస్తోంది. అతడు కారు కొనిచ్చేందుకు నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అసభ్యకరమైన ఎంఎంఎస్ క్లిప్‌ను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు గురి చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులకు అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకకపోగా, కారు కొనివ్వనందుకే ఇలాంటి ఫిర్యాదు చేసిందనే విషయం బయటపడింది.

English summary
A woman from Bareily lodged an FIR against her father accusing him of making her MMS clip and then threatening to upload them on web.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X