డెంటల్ కాలేజీ విద్యార్థినిపై యుపి ప్రొఫెసర్ అత్యాచారం
రాయపూర్: ఛత్తీస్‌గడ్‌లో పాఠాలు చెప్పాల్సిన గురువు దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడు. 24 ఏళ్ల దంత కళాశాల విద్యార్థినిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. బయటి నుంచి ఎగ్జామినర్‌గా వచ్చిన అతను విద్యార్థినిపై అఘాయిత్యం చేసినట్లు పోలీసులు మంగళవారంనాడు చెప్పారు.
అమ్మాయి ఫిర్యాదు మేరకు వికాస్ వర్మ అనే 45 ఏళ్ల ఆ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనతు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రిమ్స్ కాలేజీలో ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. వైవా ఎగ్జామ్ నిర్వహించడానికి అతను వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లు రాయపూర్ నగర పోలీసు సూపరింటిండెంట్ (కోట్వాలీ) అన్షుమాన్ సింగ్ సిసోడియా చెప్పారు

అత్యాచార సంఘటన డిసెంబర్ 26వ తేదీన రాయపూర్‌లోని ఓ హోటల్లో జరిగిందని, నగరం చూడడానికి తనతో రావాలని అమ్మాయిని పిలిచి వికాస్ వర్మ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సిసోడియా చెప్పారు. కొద్ది నెలల క్రితం వికాస్ వర్మ ఫేస్‌బుక్కులో స్నేహం చేశాడని ఆమె తన వాంగ్మూలంలో చెప్పింది.
డిసెంబర్ 25వ తేదీన వైవా పరీక్ష నిర్వహణకు రాయపూర్ డెంటల్ కాలేజీ ఆయనను ఆహ్వానించింది. మర్నాడు కొన్ని స్థలాలను సందర్శించాల్సి ఉందని, తనతో పాటు రావడానికి హోటల్‌కు రావాలని ఆమెను అతను పిలిచాడు. హోటల్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, ఎవరికీ చెప్పవద్దని కూడా అతను బెదిరించాడని సిసోడియా చెప్పారు.
అయితే, బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో వారు మౌదాహపర పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని వర్మను అరెస్టు చేయడానికి ఓ పోలీసు బృందాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పంపించారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications