రహస్యంగా ఉంచుతాం: నల్లధనం వెల్లడికి కేంద్రం మరో అవకాశం
నల్లధనం వెల్లడికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. రేపటి నుంచి ( 17 డిసెంబర్ 2016 నుంచి 31 మార్చి 3017 వరకు ఎవరైనా తమ తమ వద్ద ఉన్న ఆస్తిని వెల్లడించవచ్చునని తెలిపింది.
న్యూఢిల్లీ: నల్లధనం వెల్లడికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. రేపటి నుంచి ( 17 డిసెంబర్ 2016 నుంచి 31 మార్చి 3017 వరకు ఎవరైనా తమ తమ వద్ద ఉన్న ఆస్తిని వెల్లడించవచ్చునని తెలిపింది. నల్లధనం వివరాలు వెల్లడించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.
అలాగే నల్లధన కుబేరుల సమాచారం ఇచ్చిన వారి పేర్లు తాము రహస్యంగా ఉంచుతామని తెలిపారు. కాగా, వివరాల వెల్లడికి కేంద్రం ఈ-మెయిల్ ఐడీ రూపొందించింది.
ఆస్తులు ప్రకటించకుండా దాడుల్లో పట్టుబడితే మాత్రం తీవ్రంగా వ్యవహరిస్తారు. ఆధార్, పాన్ నంబర్ల ద్వారా ఆధారాలు సేకరిస్తారు. నల్లధనం మార్చుతున్న వారి వివరాలు ఉంటే ఈ మెయిల్ [email protected] ద్వారా చెప్పవచ్చు.

యాక్సిస్ బ్యాంకుపై కొనసాగుతున్న దాడులు
యాక్సిస్ బ్యాంకు శాఖలపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం దిల్లీలోని కృష్ణనగర్ బ్రాంచిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 నకిలీ ఖాతాలు గుర్తించారు.
నల్లధనాన్ని దాచేందుకు కొన్ని నకిలీ కంపెనీల పేరుతో ఖాతాలను తెరిచినట్లు అధికారులు గుర్తించారు. వీటి గురించి ఈడీ అధికారులు, ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన బ్యాంక్ అధికారి ఒకరు స్పందించారు. ఇప్పటికే పలువురిని విధుల నుంచి తొలగించామన్నారు. దీని వల్ల బ్యాంక్‌కు ఉన్న పేరు దెబ్బతింటుందని, కానీ ఇది కొన్ని రోజులే అని బ్యాంకు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications