అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర పశ్చిమబెంగాల్ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్ స్థాయి వరకు వ్యాపించింది.
Recommended Video
వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ఉత్తర పశ్చిమ ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా ఆరేబియా సముద్రం వరకు 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావం వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ ఓ మస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానంలో మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజులపాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలు మొదలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు.












Click it and Unblock the Notifications