డేరాబాబా దత్త పుత్రిక హనీప్రీత్ నేపాల్‌లోనే, రంగంలోకి ప్రత్యేక బృందాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

సిర్సా:డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ నేపాల్‌కు పారిపోయారని సిట్ అధికారులకు కీలక ఆధారం లభించింది. నేపాల్‌లో ఉన్న హనీప్రీత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు నేపాల్‌కు బయలుదేరాయి.

హర్యానాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జైలుశిక్ష పడిన తరువాత జరిగిన విధ్వంసం కేసులో కీలక నిందితురాలిగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు భావిస్తున్న హనీప్రీత్ సింగ్, నేపాల్ కు పారిపోయినట్టు గట్టి ఆధారం లభించింది.ఆమె ప్రస్తుతం నేపాల్ లో ఉన్నట్టు తెలుసుకున్న అధికారులు, ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు.

డేరాబాబా: వారసుడిగా జస్మీత్ సింగ్, కాదు రామ్ రహీమ్ సింగ్, ఏం జరుగుతుంది?

Dera official arrested from Rajasthan, says Honeypreet fled to Nepal

సిర్సా డేరాకు అనుబంధంగా ఉదయ్ పూర్ లో నడుస్తున్న డేరా ఆశ్రమ ఇన్ చార్జ్ ప్రదీప్ గోయల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. అయితే వారిని విచారించి హనీప్రీత్ ఎక్కడుందన్న విషయాన్ని కూపీ లాగారని తెలుస్తోంది.

హనీప్రీత్ ఆచూకీపై ప్రదీప్ నుంచి స్పష్టమైన సమాచారం లభించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతి త్వరలో హనీప్రీత్ ను అదుపులోకి తీసుకుని ఇండియాకు తీసుకు వస్తామని పోలీసులు ప్రకటించారు.

నేపాల్, భారత్ సరిహద్దుల్లోని ఏడు జిల్లాల్లో ఆమె ఎక్కడుందన్న విషయం ఇంకా తెలియరాలేదని అన్నారు. ఆమె ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు నేపాల్ వెళ్ళాయని పోలీసులు ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The SIT on Sunday arrested a key functionary of the Dera Sacha Sauda, Pradeep Goyal Insan, from Udaipur in Rajasthan. He was close to dera chief Gurmeet Ram Rahim Singh and Honeypreet.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి