డేరాబాబా కుడి భుజం దిలావర్ అరెస్ట్

డేరాబాబా కుడి భుజం దిలావర్ ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. డేరాబాబా అరెస్ట్ తర్వాత పంచకులలో చోటుచేసుకొన్న హింసాత్మక ఘటనల్లో దిలావర్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

చంఢీఘడ్: డేరాబాబా కుడి భుజం దిలావర్ ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. డేరాబాబా అరెస్ట్ తర్వాత పంచకులలో చోటుచేసుకొన్న హింసాత్మక ఘటనల్లో దిలావర్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

దాదాపు 20 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన గుర్మీత్ రామ్ రహీమ్ డేరా కుప్పకూలుతోంది. గుర్మీత్ ఇప్పటికే జైల్లో ఉండగా, డేరా మొత్తాన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని ఆయన అనుచరుల్లో ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

Dera spokesperson Dilawar Insan arrested for inciting violence in Panchkula

తాజాగా గుర్మీత్ కుడి భుజంగా చెప్పుకునే దిలావర్ ఇన్సాన్ ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్మీత్ పై అత్యాచార ఆరోపణలు నిరూపితమై, శిక్ష పడన తరువాత హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

డేరా అధికార ప్రతినిధిగా దిలావర్ వ్యవహరించారు. పానిపట్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, శుక్రవారం కోర్టు ముందు హాజరు పరుస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీఎస్ సంధూ వెల్లడించారు. ఆగస్టు 25న గుర్మీత్ పై నేరం నిరూపితమైన తరువాత దిలావర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+