GST 2.0: జీఎస్టీ 2.0 లాభం కస్టమర్లకు అందలేదా ? షాకింగ్ సర్వే రిపోర్ట్..!
కేంద్ర ప్రభుత్వం తాజాగా దసరా పండుగ సందర్భంగా జీఎస్టీ స్లాబ్ లలో భారీ మార్పులు చేసింది. నాలుగు స్లాబ్ ల్ని కాస్తా రెండుకు తగ్గించింది. దీంతో గతంలో భారీగా ఉన్న జీఎస్టీ కాస్తా తగ్గిపోయిందని, ఇక దేశంలో వస్తు వినియోగం పెరిగిపోతుందని, అంతిమంగా ట్రంప్ సుంకాల మోతకు ఇది కౌంటర్ గా కూడా ఉపయోగపడుతుందని కేంద్రం పదే పదే చెప్పింది. అయితే క్షేత్రస్ధాయిలో మాత్రం దీని వల్ల వినియోగదారులకు ఏమాత్రం ప్రయోజనం కలగలేదని తాజాగా వెలువడిన ఓ సర్వే నివేదిక తేల్చేసింది.
గతనెల 22న దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. దీంతో 28 శాతం ఉన్న జీఎస్టీ స్లాబ్ కాస్తా 18 శాతం స్లాబ్ లోకి, 12 శాతంగా ఉన్న స్లాబ్ కాస్తా 5 శాతంలోకి విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో మెజార్టీ వస్తువుల ధరలు తగ్గి తమకు భారీ ప్రయోజనం కలుగుతుందని వినియోగదారులు భావించారు. దీంతో పండుగల వేళ తమకు అసలైన పండుగ వచ్చిందని సంబర పడ్డారు. మరి నిజంగానే ఆ ప్రయోజనం వినియోగదారులకు లభించిందా లేదా అనే దానిపై లోకల్ సర్కిల్స్ అనే సంస్ధ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 66 శాతం మంది పురుషులు, 34 శాతం మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ సర్వేలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లను కలిపి ప్రశ్నలు అడిగారు. అలాగే టైర్-1 నగరాల నుండి 43 శాతం మంది,, టైర్ 2 నగరాల నుంచి 24 శాతం మంది, టైర్ 3 నుంచి టైర్ 5 వరకూ మరో 33 శాతం మంది పాల్గొన్నారు. ఈ సర్వేలో లోకల్ సర్కిల్స్ సంస్ధ 332 జిల్లాల్లోని 27 వేల మంది కస్టమర్ల నుంచి 78 వేల సమాధానాలు రాబట్టింది. వీటిలో మెజార్టీ జనం తమకు జీఎస్టీ 2.0 ప్రయోజనం అందడం లేదని తేల్చేశారు. కేవలం ఆటో మొబైల్ రంగంలో కస్టమర్లు మాత్రమే తమకు ప్రయోజనం ఉందని తెలిపారు.
ఈ సర్వేలో ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు, మందులు, విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలపై జీఎస్టీలో తగ్గింపులు తుది ధరలలో కనిపిస్తున్నాయా అని వినియోగదారులను ప్రశ్నించారు. ఇందులో వారు జీఎస్టీ 2.0 సంస్కరణల ఉద్దేశం, తమకు అందుతున్న ప్రయోజనానికి మధ్య అంతరం ఉందని తేల్చేశారు. ప్యాకేజ్డ్ ఆహారం, మందుల విషయంలో దాదాపు సగం మంది అంటే 47 శాతం జీఎస్టీ 2.0లో తమకు ఎలాంటి తగ్గింపులూ లభించలేదన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే తమకు ప్రయోజనం లభించినట్లు చెప్పారు.

వైట్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల విషయంలో మాత్రం దాదాపు 34 శాతం వినియోగదారులు పూర్తి జీఎస్టీ తగ్గింపు లభించినట్లు చెప్పారు. మరో 33 శాతం మంది పాక్షిక ప్రయోజనాలను పొందినట్లు తెలిపారు. వాహనాల విషయంలో దాదాపు 76 శాతం మంది జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం లభించినట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చినా ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ రెండింటిలోనూ చాలా మంది రిటైలర్లు ధరలను తగ్గించలేదని తెలుస్తోంది. పాత స్టాక్ రేట్లు అలాగే ఉన్నట్లు తేలింది.
కాబట్టి వ్యాపారుల సహకారం లేనిదే ఇంత పెద్ద సంస్కరణ పక్కాగా అమలు కావడం కష్టమని తేలిపోయింది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications