సంప్రదాయంగా ప్రత్యర్థులే: కానీ భావ్‌నగర్‌లో ఒక్కటైన క్షత్రియ పాటిదార్లు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో పాటిదార్లు, క్షత్రియులకు ఒకరంటే ఒకరికి పడదు. కానీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సామాజిక వర్గాలు ఒక్కటిగా పనిచేస్తున్న సెగ్మెంట్ ఒకటి ఉంది. అదే. జిల్లా కేంద్రమైన భావ్‌నగర్ సెగ్మెంట్. అధికార బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వాఘానీ బరిలో ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ అత్యంత సన్నిహితుడు దిలీప్‌సింగ్ గోహిల్ పోటీ చేస్తున్నారు. అతడు స్థానిక ఓబీసీ.. క్షత్రియుల హక్కుల పోరాట కార్యకర్త కూడా.
పాస్ భావ్‌నగర్ జిల్లా కన్వీనర్‌గా కూడా దిలీప్ సింగ్ గోహిల్ పని చేస్తున్నారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి.. పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ మద్దతుదారులకు, ఓబీసీ హక్కుల పోరాట నాయకుడు అల్పేశ్ ఠాకూర్ మద్దతుదారులకు కీలకంగా మారింది. నితిన్ భాయి గిలానీ, కుల్దీప్ సింగ్ గోహిల్ రోజు తాము 'టీ' తాగే 'టీ' స్టాల్‌ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు గానీ, ఇతరులు గానీ ఇక్కడకు రాలేదు.

 పాత ఘర్షణలు గుర్తు చేసిన ప్రధాని మోదీ

పాత ఘర్షణలు గుర్తు చేసిన ప్రధాని మోదీ

ఈ దఫా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కుల సమీకరణాలే కీలకం కానున్నాయి. రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా పటేళ్లు, క్షత్రియులు కీలకం. అంతే కాదు వారిద్దరూ పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్నారు. గిలానీ అనే స్థానికుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ భావ్ నగర్ జిల్లా పాలితానాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ పాటిదార్లు, క్షత్రియులకు సంబంధించి భావోద్వేగాలను రెచ్చగొట్టారు. 1983లో భావ్ నగర్ జిల్లాలోని మాన్ గఢ్ గ్రామంలో కొన్ని ఘర్షణలు జరిగాయి. కొందరు పాటిదార్ల దాడిలో ముగ్గురు క్షత్రియులు మరణించారు. ప్రతిగా క్షత్రియులు జరిపిన దాడిలో 12 మంది పాటిదార్లు మరణించారు. జిల్లాలోనే జరిగిన ప్రాణాంతక ఘర్షణలు ఇవే. కానీ గతంతో పోలిస్తే క్షత్రియులు, పాటిదార్లు భావ్ నగర్ జిల్లాలో మరీ ఎక్కువగా ఐక్యమయ్యారు' అని తెలిపారు.

 దేశమంతా కుల సమీకరణాలపైనే బీజేపీ ఫోకస్

దేశమంతా కుల సమీకరణాలపైనే బీజేపీ ఫోకస్

ఖామ్ (క్షత్రియ, హరిజన్, ఆదీవాసీ, ముస్లిం) ఫార్ములా పేరుతో 1985లో కాంగ్రెస్ నేత మాధవ్ సింగ్ సోలంకి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 149 స్థానాలు గెలుచుకున్నది. దీనికి తోడు సమాజంలో ఖామ్ ఫార్ములాకు ప్రతిగా మిగతా సామాజిక వర్గాల మధ్య విభజన రేఖ ఏర్పడింది. పాటిదార్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఈ పరిణామం దేశమంతటా విస్తరించడానికి బీజేపీ ఇదే వ్యూహం అమలు చేసింది. గోహిల్ నాయకుడు జిలానీ మాట్లాడుతూ రెండు సామాజిక వర్గాల మధ్య పాత గాయాలకు మందు వేస్తున్నారని చెప్పాడు. 34 ఏళ్ల క్రితం జరిగిన ఊచకోతల నాటికి తాను పుట్టి ఉండనని నమ్మకం అని చెప్పారు. తామంతా గతంలో జరిగిన ఘటనలను గుర్తుచుకోబోమని అన్నాడు.

 భావ్ నగర్‌లో 3.91 లక్షల మంది కోలీలే కీలకం

భావ్ నగర్‌లో 3.91 లక్షల మంది కోలీలే కీలకం

భావ్ నగర్ జిల్లా బుధేల్ గ్రామానికి చెందిన జిలానీ బుధేల్ గ్రామ వాసి మాట్లాడుతూ ‘మా గ్రామంలో భూ వివాదం ఉంది. వాఘానీకి, గ్రామ సర్పంచ్‌కు మధ్య తలెత్తిన వివాదం అది. వాఘానీకి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని చేసిన ప్రయత్నంతో స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. సొంత నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు పెరిగాయి' అని చెప్పారు. భావ్ నగర్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 16.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. భావ్ నగర్ లో అత్యధిక కీలకంగా ఉన్న సామాజిక వర్గం కోలీ పటేళ్లు అనే ఓబీసీలు 3.91 లక్షల మంది ఓటర్లు ఉంటారు.

 కోలీల మద్దతుపై ఇలా కమలనాథుల ఆశలు

కోలీల మద్దతుపై ఇలా కమలనాథుల ఆశలు

పాటిదార్లు 1.61 లక్షల మంది, క్షత్రియేతర రాజపుత్రులు 1.05 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరితోపాటు కరాదియా రాజపుత్రులు 45 వేల మంది ఓటర్లు ఉన్నారు. కరాదియా రాజపుత్రులకు చెందిన జీతు వాఘానీకి ఇదే ఆధిక్యం కల్పిస్తున్నది. కరాదియా రాజపుత్రులు, పాటిదార్లతోపాటు 3.11 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కోలీ సామాజిక వర్గం ఓటర్లతో సమానంగా ఉన్నారు. బీజేపీ ఈ దఫా కూడా కోలీల మద్దతుపై పక్కా విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్ర మంత్రి పురుషోత్తం సోలంకీ.. బీజేపీలో ప్రజాదరణ గల కోలీ సామాజిక వర్గ నేత. ఆయన భావ్ నగర్ రూరల్ స్థానం నుంచి పోటీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bhavnagar: Nitinbhai Ghelani and Kuldeepsinh Gohil were sitting together and having tea at a makeshift office for Congress candidate Dilipsinh Gohil. Neither is a Congress worker, nor are others in the gathering.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి